సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కు తలనొప్పిగా మారిన ముంబయి హీరోయిన్స్‌  

Heroines Shootings Corona Effect - Telugu Alia Bhatt, Corona Effect, Heroines, Lock Down, Movie Shootings, Mumbai Heroines, Pooja Hegde, Rrr

తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చి దాదాపుగా మూడు వారాలు అవుతోంది.బుల్లి తెరకు చెందిన సీరియల్స్‌ మరియు షోల షూటింగ్స్‌ మాత్రమే జరిగాయి.

 Heroines Shootings Corona Effect

సినిమాల షూటింగ్స్‌ ప్రారంభం అయ్యింది చాలా తక్కువ.షూటింగ్స్‌కు స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఎవరు కూడా వెళ్లలేదు.

వర్మ లాంటి వాళ్లు తప్ప ఎవరు కూడా పెద్దగా షూటింగ్‌ చేసేందుకు సినీ ప్రముఖులు ఆసక్తి చూపడం లేదు.జులై నుండి కొన్ని సినిమాల షూటింగ్స్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కు తలనొప్పిగా మారిన ముంబయి హీరోయిన్స్‌-Movie-Telugu Tollywood Photo Image

తెలుగు సినిమాల్లో ఎక్కువగా ముంబయి ముద్దుగుమ్మలు నటిస్తూ ఉంటారు.వారు ఇప్పుడు హైదరాబాద్‌ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.ముంబయిలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఇదే సమయంలో హైదరాబాద్‌లో కూడా కేసులు రోజుకు వెయ్యికి తగ్గడం లేదు.

దాంతో హీరోయిన్స్‌ ఇల్లు వదిలి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.సినిమా ఆఫర్లు అయినా వదులుకుంటాం కాని ఈ సమయంలో మాత్రం షూటింగ్స్‌కు హాజరు అయ్యే పరిస్థితి లేదు అంటూ స్టార్‌ హీరోయిన్స్‌ అంటున్నారు.

ముంబయి ముద్దుగుమ్మలు ఎవరు కూడా షూటింగ్స్‌కు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించని కారణంగా షూటింగ్‌ మొదలు పెట్టాలనుకున్న వారు కూడా చాలా మంది ఆపేస్తున్నారు.హీరోయిన్‌ లేకుండా కొందరు కానిచ్చేస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌కు ఆలియా ఇప్పట్లో వచ్చేది లేదు అని చెప్పేసింది. పూజా హెగ్డే కూడా ఇప్పట్లో హైదరాబాద్‌ రానంది.

ఇతర స్టార్స్‌ ఎవరు కూడా షూటింగ్‌కు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు.కొందరు ఆగస్టు అంటుండగా మరి కొందరు అక్టోబర్‌ వరకు వెయిట్‌ చేస్తామంటున్నారు.

దాంతో టాలీవుడ్‌ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా ఈ విషయం మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroines Shootings Corona Effect Related Telugu News,Photos/Pics,Images..

footer-test