ఒకప్పుడు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడానికి కొందరు తారలు ఉండేవారు.అలనాటి సినిమాల్లో అయితే జయమాలిని, జ్యోతి లక్ష్మి, సిల్క్ స్మిత, అనురాధ.
ఆ తర్వాత కాలంలో డిస్కో శాంతి లాంటి వారు ఉండేవారు.వీరు మాత్రమే సినిమాల్లో క్లబ్ డ్యాన్సులు లాంటివి చేసేది.
హీరోయిన్లు ఆ పాటల జోలికి వెళ్లేవారు కాదు.కానీ.
ప్రస్తుతం ఆ హద్దులు చెరిగిపోయాయి.ఐటెం సాంగ్స్ చేయడానికి వేరే వాళ్లు అంటూ ఎవరూ ఉండరు.
దర్శక నిర్మాతలు ఓ అడుగు ముందుకు వేసి స్టార్ హీరోయిన్లతోనే డ్యాన్సులు చేయిస్తున్నారు. ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు.
ఫలానా హీరోయిన్ తోనే ఈ పాట చేయాలి అనుకుంటున్నారు.ప్రేక్షకులు కూడా స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అటు స్పెషల్ సాంగ్స్ చేయడానికి హీరోయిన్లు బాగానే డబ్బులు వసూలు చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నారు అందాల ముద్దుగుమ్మలు.ఐటెం సాంగ్స్ పేరుతో బాగానే డబ్బులు అందుకుంటున్నారు.ఒక్కో ఐటెం సాంగ్ కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు తీసుకుంటున్నారు.అవకాశం వచ్చినప్పుడు అందినకాడికి దండుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అందాల తారలు.
ఇక తెలుగు సినిమా పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్ కు శ్రీకారం చుట్టింది ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రియా శరన్.దేవదాస్, మున్నా, తులసి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి అదరగొట్టింది.అటు కేజీఎఫ్, అల్లుడు శీను, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసి దుమ్ముదులిపింది.
జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ కాజల్ అగర్వాల్, రంగస్థలంలో జిగేలు రాణి అంటూ పూజ హెగ్డే స్పెషల్ సాంగ్స్ చేసి అదుర్స్ అనిపించారు.తాజాగా పుష్ప సినిమాలో సమంత కూడా స్పెషల్ సాంగ్ చేసి జనాలను కట్టిపడేసింది.
ఆమె వంటి విరుపులకు కుర్రకారు మెలికలు తిరిగారని చెప్పుకోవచ్చు.