జక్కన్న మల్టీస్టారర్‌ ముద్దుగుమ్మలు మహా ఖరీదు గురూ  

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సమయంలోనే రెండవ షెడ్యూల్‌కు హీరోయిన్స్‌తో రాజమౌళి వెళ్తాడని ప్రచారం జరిగింది. అయితే రెండవ షెడ్యూల్‌ కూడా హీరోయిన్స్‌ లేకుండానే మొదలు పెట్టాడు. ఈనెల చివరి వరకు రెండవ షెడ్యూల్‌ కూడా పూర్తి కాబోతుంది. ఈ సమయంలోనే హీరోయిన్స్‌ విషయంలో తుది చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Heroines In Rajamouli RRR Movie Very Costly-Alia Bhutt Heroines Rrr Jr Ntr Parineeti Chopra Rajamouli Ram Charan

Heroines In Rajamouli RRR Movie Very Costly

రాజమౌళి సినిమా అంటే బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందుకే బాలీవుడ్‌ టచ్‌ ఇచ్చేందుకు ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా పరిణితి చోప్రా మరియు ఆలియా భట్‌లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అందుకోసం చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే వారిద్దరి ఎంపిక విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుపుతున్నారు. వచ్చే షెడ్యూల్‌లో సినిమా కు సంబంధించిన కొన్ని లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరించే అవకాశం ఉంది. అందుకే హీరోయిన్స్‌ ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.

Heroines In Rajamouli RRR Movie Very Costly-Alia Bhutt Heroines Rrr Jr Ntr Parineeti Chopra Rajamouli Ram Charan

ఈ మల్టీస్టారర్‌లో ఆలియా భట్‌ మరియు పరిణితి చోప్రాలు హీరోయిన్స్‌గా నటించడం దాదాపు కన్ఫర్మ్‌ అయ్యింది. వారిద్దరు ఈ చిత్రం కోసం భారీ పారితోషికంను డిమాండ్‌ చేస్తున్నారట. పరిణితి చోప్రా అయిదు కోట్ల రూపాయలను డిమాండ్‌ చేస్తుండగా, ఆలియా భట్‌ మరో కోటి అదనంగా అంటే ఆరు కోట్ల రూపాయలను డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరి పారితోషికాలు కలిపి అటు ఇటుగా పది కోట్లకు మించి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు సినిమాలో హీరోయిన్స్‌కు పది కోట్ల బడ్జెట్‌ అంటే మామూలు విషయం కాదు. మరి ఇంత బడ్జెట్‌ దానయ్య బరాయిస్తాడా చూడాలి.