ప్రేమించిన పాపానికి హత్యానేరం పడిన ముగ్గరు హీరోయిన్లు

కొన్నిసార్లు కొన్ని ఘటనలు ఆయా వ్యక్తుల జీవితాలను తీవ్ర కుదుపులకు గురిచేస్తాయి.అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలు బుల్లెట్లలా తగులుతుంటే జీవితం అక్కడితో ఆగిపోతే బాగుంటుంది అనిపిస్తుంది.

 Heroines Faced Hard Time With Love Stories, Tollywood , Sushanth Raj Puth , Riya-TeluguStop.com

చేయని తప్పులకు అన్ని వేళ్లు తమవైపే ఎత్తి చూపిస్తుంటే మౌనంగానే ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది.అప్పుడున్న పరిస్థితుల్లో మౌనం మినహా చేసేదేమీ ఉండదు.

మూడు ఘటనల్లో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు ముగ్గురు హీరోయిన్లు.ఇంతకీ వారెవరు? వారు ఎదరుర్కొన్ని ఆరోపణలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సుశాంత్‌సింగ్‌- రియా

Telugu Faced Hard Time, Love, Mukesh, Pradeep Pavani, Rekha, Riya, Tollywood-Tel

గతేడాది క్రితం బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.అతడి చావుకు కారణం తన ప్రియురాలు రియానే అని అప్పట్లో వార్తలు వెల్లువెత్తాయి.అదే కోణంలో కేసు విచారణ కూడా కొనసాగింది.ఆమెను పోలీసులు పలు రకాలుగా విచారించారు.తనతో ఉన్న సంబంధాన్ని మరింతలోతుగా తవ్వి తీశారు.కాన తనపై పోలీసులు ఏ నిర్ణయానికి రాలేకపోయారు.

కానీ రకరకాల మీడియాల్లో ఆమె గురించి రకరకాల వార్తలు వచ్చాయి.తన మూలంగా సుశాంత్ చనిపోయాడు అనే స్థాయిలో తీర్పులు వచ్చేశాయి నెటిజన్ల నుంచి.

వాస్తవం ఏంటనేది ఇప్పటికీ బయటకు వెళ్లడి కాలేదు.ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
రేఖ- ముఖేష్

Telugu Faced Hard Time, Love, Mukesh, Pradeep Pavani, Rekha, Riya, Tollywood-Tel

తాజాగా సుశాంత్ కేసులో రియా ఎలాంటి ఆరోపణలను ఎలా ఎదుర్కొందో.సేమ్ ఇలాగే 30 సంవత్సరాల క్రితం రేఖ ఇలాగే ఆరోపణలు ఎదుర్కొంది.రియాను రేఖతో పోల్చుతున్నారు చాలా మంది.బాలీవుడ్ లో రేఖ, అమితాబ్ చాలా క్లోజ్ గా ఉండేవారు.ఒకానొక సమయంలో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి.కానీ బిగ్ బీ జీవితంలోకి జయా వచ్చి చేరింది.

దీంతో చాలాకాలం రేఖ ఒంటరిగానే ఉంది.చివరకు ముఖేష్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది.

కానీ వివాహం చేసుకున్న కొద్ది రోజులకే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.ముఖేష్ కుటుంబ స‌భ్యులు మాత్రం రేఖ వల్లే చనిపోయారని ఆరోపించారు.

అయితే డిప్రెష‌న్‌తోనే తను చనిపోయాడని చెప్పింది.ఈ ఘటన తర్వాత రేఖ చాలా కుంగిపోయింది.

ప్రదీప్- పావనీరెడ్డికొంత కాలం క్రితం టీవీ నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఆయన భార్య పావనీ సైతం టీవీ నటిగానే కెరీర్ కొనసాగించింది.ఈ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే వీరిద్దరి మధ్య జరిగిన చిన్నగొడవల కారణంగా క్షణికావేశంలో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ఈ మరణానికి కారణం పావనీయే అంటూ తీవ్ర ఆరోపణలు వినిపించాయి.అయితే పోలీసులు మాత్రం ప్రదీప్ సూసైడ్ చేసుకున్నట్లు తేలింది.

రేఖ, రియా, పావనీ విషయంలో ఓకే రకమైన ఆరోపణలు రావడం విశేషం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube