ఈతరం హీరోయిన్స్‌ బాగా తెలివైన వారు

ఒకప్పుడు హీరోయిన్స్‌ కేవలం నటనకే పరిమితం అయ్యే వారు.వారికి కనీసం బయట ప్రపంచం కూడా తెలియక పోయేది.

 Heroines Are Interested In Restaurant Business,restaurant,heroines,radhika Apte-TeluguStop.com

తాము సంపాదిస్తున్న డబ్బు ఏమవుతుంది, ఇంకా ఏమార్గం ద్వారా అయినా సంపాదించ వచ్చా అనే విషయాలను అప్పటి హీరోయిన్స్‌ ఎవరు కూడా ఆలోచించలేదు.కాని ఇప్పుడు ఉన్న హీరోయిన్స్‌ మాత్రం రూపాయి వస్తే దాన్ని పది రూపాయలుగా ఎలా మార్చాలి అనే విషయాలపై చాలా ఆలోచిస్తున్నారు.

ఎంతో మంది హీరోయిన్స్‌ తమకు వచ్చిన పేరుతో సెలబ్రెటీ హోదాతో మంచి గుర్తింపుతో బిజినెస్‌లు చేస్తున్నారు.హీరోయిన్స్‌ ఈమద్య కాంలో రకరాల బిజినెస్‌లు చేశారు.వారి బిజినెస్‌లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి.అందుకే తమ బ్రాండ్‌ వాల్యూకు తగ్గట్లుగా ఏదో ఒక బిజినెస్‌ను ఎంపిక చేసుకోవడం, పెట్టుబడి పెట్టకుండానే మరో పార్టనర్‌తో పెట్టుబడి పెట్టించి తమదిగా ప్రచారం చేసి మంచి వ్యాపారం చేసుకోవడం చేస్తున్నారు.

ఈమద్య కాలంలో హీరోయిన్స్‌ ఎక్కువగా రెస్టారెంట్‌ బిజినెస్‌ అంటున్నారు.తాజాగా రాధిక ఆప్టే కూడా రెస్టారెంట్‌ బిజినెస్‌పై ఆసక్తితో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.త్వరలోనే తాను రెస్టారెంట్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చింది.ఇటీవల తాను దర్శకత్వం వహించిన షార్ట్‌ ఫిల్మ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రాధిక ఆప్టే ఈసారి మరో ప్రయత్నంగా రెస్టారెంట్‌ను ప్రారంభిస్తానంటూ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube