ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ కి( Heroines ) చాలా తక్కువ టైం ఉంటుంది.వారు హీరోల మాదిరిగా ఏళ్లకు ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండలేరు.
ప్రస్తుతానికి మన తెలుగు ఇండస్ట్రీ నే( Tollywood ) ఉదాహరణగా తీసుకుంటే 60 ఏళ్ళు వచ్చిన హీరోలు కూడా ఇంకా యంగ్ హీరోల మాదిరిగా సినిమాలు తీస్తూ జనాల పైకి రుద్దుతున్నారు.కానీ అదే వయసులో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది జరిగే పనేనా.
అందుకే దాదాపు 30 ఏళ్లు వచ్చాయి అంటే ఇక హీరోయిన్స్ పని అయిపోయినట్టే.వారి కెరియర్ స్పాన్ ఇంత తక్కువగా ఉన్నా కూడా వారు తీసుకోవలసిన జాగ్రత్తలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి.

ఫిగర్ మెయింటైన్ చేయడం, అందం మెయింటైన్ చేయడం, అన్నిటికీ మించి కాంటాక్ట్స్ కలిగి ఉండడం.అన్నీ కూడా కత్తి మీద సాము చేయడంతో సమానం.తీరా ఇవన్నీ మైంటైన్ చేస్తూ ఏదో ఒక సినిమాలో( Movies ) నటిస్తే అది హిట్ అయితే పర్వాలేదు ఒకవేళ ఫ్లాప్ అయితే అది హీరోయిన్ వల్లే అయినట్టుగా మన ఇండస్ట్రీ వారిని పక్కకు పెడుతుంది.రెండు మూడు సినిమాలు హీరోయిన్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే ఇక అంతే సంగతులు ఐరన్ లెగ్( Iron Leg ) అనే ముద్ర వేస్తారు.
అదే హీరో ( Hero ) ఎన్ని చిత్రాలు ప్లాప్ అయినా సరే మళ్లీ కొత్తగా సరికొత్తగా వచ్చాను అంటూ డైలాగులు చెబుతాడు.ఇక బాడీ పెరగకుండా ఉండడానికి ఏ నటి అయినా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఒకరోజు కాస్త తక్కువ తినాలి అంటేనే ఎంతో ఆలోచిస్తాం.

365 రోజులు కూడా బాడీ మెయింటైన్ చేయడం కోసం చాలా కొద్ది మొత్తంలో తింటూ ఎంతో కష్టపడుతూ సినిమాలు తీసే హీరోయిన్స్ పట్ల ఇండస్ట్రీ తీరు మారాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.నటిగా ఏజ్ పెరిగిందా, ఫెయిల్ అవుతుందా లేదా అని కాదు సరిగ్గా నటిస్తుందా లేదా అనేది చూస్తే బాగుంటుంది అనేది కొంతమంది వాదన.పైగా హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ రెమ్యునరేషన్( Heroines Remuneration ) చాలా తక్కువ ఉంటుంది.డబ్బు సంపాదించుకోలేక చివరికి కెరియర్ ను కోల్పోయి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన హీరోయిన్స్ వేలల్లో ఉన్నారు.
ఇకనైనా కాస్త కళ్ళు తెరిచి వారి కష్టాన్ని గుర్తిస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో చాలామంది హీరోయిన్స్ అభిమానులు కోరుకుంటున్నారు.







