అండర్ వాటర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో బ్యాచిలర్ నటీనటులంతా మొత్తానికి పెళ్లి లతో ఓ ఇంటివాళ్ళు అయిపోతున్నారు.గత ఏడాది నుంచే వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న నటీనటులు.

 Heroine Who Shared The Proposal Video-TeluguStop.com

తమ పెళ్లి జీవితంతో సంతోషంగా గడుపుతున్నారు.అంతేకాకుండా కాజల్, నిహారిక ల పెళ్లిలు కూడా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా మరో హీరోయిన్ కూడా ఓ ఇంటి కోడలు కానున్నది.ఇంతకీ ఆమె ఎవరో కాదు‌.

 Heroine Who Shared The Proposal Video-అండర్ వాటర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరిన్ కౌర్.హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.

ఇక ఆ సినిమాతో మంచి విజయాన్ని సాధించుకున్న మెహరిన్ వరుస సినిమాల్లో నటించింది.అంతే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కనున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.ఇక ఈ బ్యూటీ త్వరలో ఓ ఇంటి కోడలు కానుంది.

హరియానా మాజీ ముఖ్యమంత్రి, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్ దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్ తో మధ్యప్రదేశ్ జైపూర్లోని అలీల కోటలో మార్చి 13న మెహరీన్ నిశ్చితార్థం జరిగింది.పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరుగగా.

తమ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను మెహరీన్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.ఇదిలా ఉంటే తాజాగా అండర్ వాటర్ లో మరోసారి ఈ జంట ప్రపోజ్ చేసుకున్నారు.

ఈ విషయం గురించి తాజాగా మెహరీన్ కొన్ని విషయాలు పంచుకోగా ప్రపోజల్ వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకున్నారు.భవ్య పుట్టినరోజు సమయములో అండమాన్ కు వెళ్ళామంటూ తెలిపింది.

అక్కడే స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు అండర్ వాటర్ లో తన కాబోయే భర్త బిష్ణోయ్ ప్రపోజ్ చేశాడని తెలిపింది.నీటిలో తన కాబోయే భర్త తన దగ్గరకు వచ్చి ‘విల్ యూ మ్యారీ మీ’ అనే ప్రపోజల్ కార్డ్ ని చూపించి రింగ్ తొడిగాడని తెలిపింది.

ఇక ఈ ప్రపోజల్ తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది మెహరీన్.ఇక త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలిపింది

.

#Mehreen Kaur #Under Water #Engagement

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు