చెల్లి పెళ్లి కోసం ఎక్కువ కలలు కన్నా.. వితిక ఎమోషనల్ పోస్ట్..!  

బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు వితికా షేరు.టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను వివాహం చేసుకున్న వితికా షేరు బిగ్ బాస్ షో సీజన్ 3లో పాల్గొనడం ద్వారా పాపులారిటీని మరింత పెంచుకున్నారు.

TeluguStop.com - Heroine Vithika Sheru Emotional Post Viral In Social Media

వితికా షేరు చెల్లి కృతికా షేరు పెళ్లి సోమవారం ఘనంగా జరగగా చెల్లి పెళ్లి గురించి వితిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్టులు పెట్టారు.

వితిక తన్ పోస్ట్ లో నా పెళ్లి కంటే చెల్లి పెళ్లి కోసమే ఎంతో కష్టపడ్డానని.

TeluguStop.com - చెల్లి పెళ్లి కోసం ఎక్కువ కలలు కన్నా.. వితిక ఎమోషనల్ పోస్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చెల్లి పెళ్లి కోసం ఎక్కువ కలలు కన్నానని.అందుకే ఎంతో ఇష్టపడి చెల్లి పెళ్లి చేశానని పేర్కొన్నారు.

కృతిక తనకు చెల్లిలా పుట్టినా తాను మాత్రం చెల్లిని తల్లిలా చూసుకున్నానని ఆమె అన్నారు.చెల్లి పెళ్లి గురించి 20 సంవత్సరాలుగా తాను కలలు కంటున్నానని.

ఆ కలలు నిజమై చెల్లి పెళ్లి చేసినందుకు ఎంతో గర్వంగా ఉందని వితిక పేర్కొన్నారు.

చెల్లి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, చెల్లి కొత్త ఇల్లు కొనుక్కోవడంతో పాటు కోరుకున్నవి కోరుకున్న విధంగా జరగాలని వితిక అన్నారు.దేవుడు చెల్లి, క్రిష్ ను చల్లగా చూడాలని.ఇప్పటినుంచి చెల్లి చేసే ప్రతి పని తను గర్వపడే విధంగా ఉండాలని వితిక పేర్కొన్నారు.

వితిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.వరుణ్ వితికల జంట ఈ పెళ్లికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

పెళ్లికూతురు గెటప్ లో ఉన్న చెల్లి ఫోటోను వితికా షేరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.కృతికా షేరు పెళ్లి ఘనంగా జరగగా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లు ఈ వివాహానికి అతిథులుగా హాజరయ్యారు.

#Krutika Sheru #HeroineVithika #Emotional Post #Varun Sandesh #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు