పిలిచి మరి సినిమా హీరోయిన్ ని చేస్తే గిరి బాబు కు విజయశాంతి నమ్మకద్రోహం చేసిందా..?

సినీ జనానికి సెంటిమెంట్స్ అస్సలు ఉండవు.కృతజ్ఞత భావం అసలే ఉండదు.

 Heroine Vijayashanthi Ignored Actor Giribabu, Heroine Vijayashanthi , Vijayashan-TeluguStop.com

అంతేకాకుండా దీనంతటి దుర్మార్గమైన పరిశ్రమ మరొకటి లేదు.ఎప్పుడూ కూడా నేను, నాకు, నాకేంటి, అనేవే చూసుకోవాలి.

ఇతరుల గురించి అసలు పట్టించుకోకూడదు.లేదంటే మట్టి కొట్టుకుపోతాం, ఎవరు చేరదీయరు కూడా.

అని సీనియర్ నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గిరిబాబు గారు అంటున్నారు.ఆయనకి అంత నమ్మక ద్రోహం చేసిన టాప్ హీరోయిన్ మరెవరో కాదు.లేడీ అమితాబ్ గా పేరు పొందిన విజయశాంతి.ఈరోజు విజయశాంతి ఇంతటి స్టార్ హీరోయిన్ గా ఉందంటే దానికి పునాది వేసింది గిరిబాబు గారే.కానీ ఆయనకే నమ్మక ద్రోహం చేసింది విజయశాంతి అని గిరిబాబు గారు ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.

విజయశాంతి తల్లి తండ్రులు చిన్న వయసులోనే చనిపోయారు.

ఇంకా విజయశాంతి తన అన్నయ్య, పిన్ని దగ్గర పెరిగారు.అయితే విజయశాంతిని ఎలాగయినా హీరోయిన్ చేయాలనీ తన పిన్ని శత విధాలా ప్రయత్నాలు చేస్తుంది.

రెండేళ్లుగా తిరుగుతున్న కూడా ఎక్కడా అవకాశాలు రాలేదు.ఒకసారి గిరిబాబు కూడా విజయశాంతిని చూసి బాగుంది అనుకున్నారంట గాని తన టాలెంట్ చూడలేదు.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిలాడీ మూవీ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులవి.ఆ సినిమాలో గిరిబాబుది ఒక ముఖ్యమైన పాత్ర.

ఆ సినిమాలో తోలుత దాసరి నారాయణ రావు గారి స్వప్న సినిమాలో నటిగా లాంచ్ అయిన స్వప్నను హీరోయిన్ గా పెట్టుకున్నారు.కానీ ఎందుకో స్వప్న గిరిబాబు గారికి సరిగా నచ్చలేదు.

దానితో ఆ సినిమా డైరెక్టర్ అయిన విజయ నిర్మల గారితో ఎందుకో ఈ సినిమాలో కృష్ణ గారి పక్కన ఆమె సరిపోదేమో అన్నారట.ఎందుకో ఆవిడ నాకు నచ్చలేదు అని నిర్మొహమాటంగా చెప్పేశారట.

కృష్ణ గారి దాక ఈ విషయం వెళ్లిందట.సరే ఆ హీరోయిన్ వద్దు మరి ఇప్పటికిప్పుడు మనకి డేట్స్ ఇచ్చే హీరోయిన్ ఎవరు దొరుకుతారు అని అన్నాడట.

అప్పుడు వెంటనే విజయశాంతికి కబురు పంపించి వెంటనే విజయశాంతిని పిలిపించారట.విజయశాంతిని చూసి మరి చిన్నపిల్లలా ఉందిగా అన్నగాని లేదు లేదు మీ పక్కన సరి జోడిగా ఉంటుందని చెప్పి కృష్ణ గారిని కన్విన్స్ చేసి ఒప్పించారట.

ఇంకా స్వప్న అయితే ఎన్నో ఆశలు పెట్టుకుంది అంట కృష్ణ గారి పక్కన నటిస్తున్న అని ఎంతగానో ఎదురు చూసిందట కానీ కృష్ణ గారు అండ్ సినిమా టీం అందరూ కలిసి స్వప్న కి సారీ చెప్పి డబ్బులు ఇచ్చి తిరిగి పంపిచేసారు.ఈ సినిమా ఒప్పుకున్న కారణంగా మరో రెండు సినిమాలు వదిలేసుకుందట స్వప్న.

ఇప్పుడు కృష్ణ గారి సినిమా కూడా చేజారిపోయింది.దీని అంతటికి కారణం గిరిబాబు గారని తెలిసి.

సార్ మీకిది న్యాయంగా ఉందా.ఎందుకిలా చేసారు.

నాకు అన్యాయం చేసారు అని అడగడంతో లేదమ్మా నీకు వేరే సినిమాలో మరోక ఆఫర్ ఇప్పిస్తా అని చెప్పాడట.

Telugu Giribabu, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

విజయశాంతితో షూటింగ్ మొదలు పెట్టేసారు.అయితే విజయశాంతికి నటన కొత్త అవ్వడంతో సారిగా యాక్ట్ చేయలేకపోతోంది.దీనితో విజయనిర్మల గారు తిట్టడం మొదలుపెట్టారట.

గిరిబాబుతో ఈ అమ్మాయిని తీసుకొచ్చింది నువ్వే కదా తనకి ఎలా చేయాలో ఏంటో నువ్వే నేర్పు అని అందట.దీనితో గిరిబాబు విజయశాంతిని ఒక కూతురిలా కూర్చోపెట్టుకుని ఇలా చేయాలి.

అలా చేయాలి అని చెప్పాడట.బయపడకు అని దైర్యం చెప్పారట.

విజయశాంతి నటించేటప్పుడు పక్కనే ఉండి ప్రోత్సహించాడట గిరిబాబు.ఆ సినిమాని కంప్లీట్ చేశారు.

ఆ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది.ఆ తర్వాత పండంటి జీవితం సినిమాలో శోభన్ బాబు గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు.

అయితే కొడుకు గా నటిస్తున్న శోభన్ బాబు పక్కన విజయశాంతి హీరోయిన్ గా పెట్టుకోమని గిరిబాబు గారు రెకమెండ్ చేశారట.ఆ సినిమాలో గిరిబాబు విజయశాంతి తండ్రిగా కూడా నటించారు.

మళ్ళీ షూటింగ్ లో విజయశాంతి నటనకు శోభన్ బాబు విస్తిపోయారు.మళ్ళీ గిరిబాబు రంగంలోకి దిగి విజయశాంతికి దైర్యం చెప్పారు.

Telugu Giribabu, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

ఆ తర్వాత విజయశాంతి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.అలా విజయశాంతి టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మారిపోయింది.అయితే అప్పట్లో నాగదేవత సినిమాకి సన్నాహాలు జరుగుతున్న రోజులవి.ఆ సినిమాలో అర్జున్ హీరో.ఆ సినిమా ఏవిఎం బ్యానర్ ది.ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కి గిరిబాబు గారు అయితే బాగుంటుందని a సినిమా డైరెక్టర్ మేనేజర్ తో చెప్పి గిరిబాబుకి ఫోన్ చేయించారు.ఏవిఎం బ్యానర్ లో ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదని, అడిగిన డేట్స్ అన్నీ ఇచ్చేసాడు గిరిబాబు.ఏవిఎం బ్యానర్ లో చేస్తున్నా కదా అని వేరే హీరోల సినిమాలు కూడా వదులుకున్నాడు.

Telugu Giribabu, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

డేట్స్ దగ్గర పడడంతో ఏవిఎం బ్యానర్ వాళ్ళు కాల్ మాత్రం చేయలేదట.అసలు ఏమైందో ఏంటో కొనుక్కుందాం అని చెప్పి మేనేజర్ కి ఫోన్ చేశారంట గిరిబాబు.ఆ మేనేజర్ కొంచెం తటపటాయిస్తూ సార్ మీరు చేసే రోల్ పాజిటివ్ రోల్.ఆ పాత్రలో మీరు వద్దు అని చెప్పి విజయశాంతి గారు డైరెక్టర్ తో చెప్పారట అనే విషయాన్నీ చెప్పాడట మేనేజర్.

ఈ మాట విని షాక్ లో నున్న గిరిబాబు అదేంటయ్యా నటుడు అన్నాక అన్నీ పాత్రలలో చేస్తాడు అని అన్నారట.ఏమో సార్ ఇవన్నీ నాకు తెలియదు మిమ్మల్ని ఈ సినిమాలో వద్దు అంటే వద్దు అని కరాఖండిగా చెప్పేశారు విజయశాంతి గారు అని చెప్పి ఆ పాత్రను రంగనాధ్ గారితో చేయించారు అని చెప్పారట.

ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అని తన చుట్టూ తిరుగుతూ ఆప్యాయత చూపించే విజయశాంతి ఇలా ప్రవర్తించడం గిరిబాబు గారిని బాగా బాధపెట్టింది అని ఓపెన్ గా చెప్పేవారు గిరిబాబు గారు. ఆ నాగ దేవత సినిమా వలన సుమారు మూడు నాలుగు నెలలు ఇంట్లో కాళిగా కూర్చొవలిసిన పరిస్థితి వచ్చిందట గిరిబాబుకి.

ఆ రోజు నుంచి ఈ సినిమా వాళ్లకి కృతజ్ఞతాభావం అనేది లేదు అని అంటూ ఉంటారు గిరిబాబు గారు.ఎప్పుడైనా గాని విజయశాంతి గిరిబాబు గారికి ఎదురయినా గాని అసలు వాళ్ళ మధ్య ఏదీ జరగలేదు అన్నట్లుగా ఉండేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube