ఆ డైరెక్టర్ తో సినిమా చేసినప్పుడు నరకం అనుభవించాను అంటూ హీరోయిన్ తాప్సి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు,కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం విభిన్నమైన కథలను మరియు పాత్రలను ఎంచుకొని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు.అందం తో పాటుగా నటన కూడా అతి ముఖ్యం అని నమ్మే హీరోయిన్స్ వీళ్ళు.

 Heroine Tapsee Shocking Comments About Jhummandi Nadam Movie Director Raghavendr-TeluguStop.com

అందుకే ఇన్నాళ్లు అయినా ఇంకా ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు తాప్సి.

( Tapsee ) ఈమె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాథం’( Jhummandi Nadam ) అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.మంచు మనోజ్ ఇందులో హీరో, తొలిసినిమా తోనే ఈమె ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం లో సక్సెస్ అయ్యింది.

ఆ సినిమాలో ఉన్న స్టోరీ రొటీన్ కంటెంట్ అయ్యినప్పటికీ కేవలం తాప్సి అందాలను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడి మరీ వెళ్లారు.ఫలితంగా ఈ చిత్రం అప్పట్లో పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యింది.

ఇక ఆ చిత్రం తర్వాత ఈమెకి అవకాశాలు క్యూలు కట్టేశాయి.

Telugu Raghavendra Rao, Tapsee, Jhummandi Nadam, Manchu Manoj, Tollywood-Movie

తెలుగులో చాలా సినిమాలు చేసింది కానీ సూపర్ హిట్ సాధించిన చిత్రాలను మాత్రం చేతి వేళ్ళతో లెక్కపెట్టవచ్చు. ‘ఝుమ్మంది నాథం’ తర్వాత ఈమెకి తెలుగు లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా ద్వారానే సూపర్ హిట్ లభించింది.ఇందులో ఆమె సెకండ్ హీరోయిన్,హిట్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈమెకి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉండడానికి కారణం ఆమె అందం మరియు నటనే.

తెలుగు లో విజయాలు పెద్దగా లేకపోయినప్పటికీ తమిళం మరియు హిందీ లో ఈమెకి మంచి విజయాలు దక్కాయి.ముఖ్యంగా ఈమెకి బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.

అక్కడ ఈమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.అందులో అమితాబ్ బచ్చన్ తో చేసిన ‘పింక్’ అనే చిత్రం కూడా ఉంది, ఈ సినిమాని తెలుగు లో వకీల్ సాబ్ పేరు తో పవన్ కళ్యాణ్ రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టాడు.

ఎక్కువగా ఈమె బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వచ్చింది, సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువే.

Telugu Raghavendra Rao, Tapsee, Jhummandi Nadam, Manchu Manoj, Tollywood-Movie

ఇది ఇలా ఉండగా గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాప్సి ని ‘మీకు అందాలను ఆరబొయ్యడం అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా’ అని అడుగుతుంది.దానికి తాప్సి సమాధానం చెప్తూ ‘అలా అని ఏమి లేదు.కథ డిమాండ్ చేస్తే ఏది అవసరమైన చెయ్యాలి.

నా మొదటి సినిమాకి రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు.ఇందులో నేను అందాల ఆరబోత ఆయన కోరినట్టే చేశాను, అప్పట్లో శ్రీదేవి మరియు జయప్రద వంటి వారితో రాఘవేంద్ర రావు గారు ఏమి చేయించారో, నాతో కూడా అదే చేయించారు, కానీ ఆయన ఇచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు నేను నరకం అనుభవించేదానిని, అందువల్ల చాలా ఇబ్బంది పడ్డాను, వెరైటీ కాస్ట్యూమ్స్ అన్నీ నా చేత వేయించాడు ఆయన’ అంటూ చెప్పుకొచ్చింది తాప్సి.

ప్రస్తుతం తాప్సి చేతిలో రెండు తమిళ సినిమాలు, మూడు హిందీ సినిమాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube