తాప్సి అరుదైన రికార్డ్‌.. ఏ సౌత్ హీరోయిన్‌ కి దక్కలేదు

మంచు మనోజ్‌ మొదటి సినిమా ఝుమ్మంది నాధం సినిమా లో హీరోయిన్‌ గా నటించిన సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను ఆ తర్వాత తెలుగు లో బిజీ అయ్యింది.దురదృష్టమో ఏమో కాని ఆఫర్లు వచ్చినా అవి సక్సెస్ అవ్వలేదు.

 Heroine Tapsee Pannu Rare Record In Bollywood , Bollywood News, Flim News, Heroi-TeluguStop.com

కొన్ని సక్సెస్ అయినా కూడా ఆమెకు స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు రాలేదు.కొన్ని సంవత్సరాల పాటు తెలుగు లో నటించింది.

ఆ తర్వాత తమిళంలో కూడా సినిమా ల్లో నటించే ప్రయత్నాలు చేసింది.అక్కడ ఈ అమ్మడు చేసిన సినిమా లు పర్వాలేదు అనిపించాయి.

కాని అక్కడ కూడా ఈమెకు స్టార్‌ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు రాలేదు.ఈమె నటించిన సినిమా లు హిట్ అయిన ప్లాప్ అయినా కూడా ఒకే తరహా క్రేజ్ ఈమెకు ఉంటూ వచ్చింది.

సౌత్ లో లాభం లేదు అనుకున్న ఈ అమ్మడు ఉత్తరాది బాట పట్టింది.సౌత్ నుండి వెళ్లిన హీరోయిన్స్ అతి తక్కు మంది మాత్రమే అక్కడ సక్సెస్ అయ్యారు.

కొందరు రెండు మూడు సంవత్సరాలు కాస్త అటు ఇటుగా సందడి చేసి మళ్లీ వెనక్కు తిరిగి వచ్చిన సందర్బాలు ఉన్నాయి.

తాప్సి కూడా అలాగే బాలీవుడ్ నుండి తిరిగి వస్తుందని అనుకున్నారు.

కాని తాప్సి కి అక్కడ మంచి ఆఫర్లు దక్కాయి.కమర్షియల్‌ సినిమా ల్లో కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమా ల్లో కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా ల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

తద్వారా ఈ అమ్మడికి అక్కడ పాపులారిటీ దక్కింది.తెలుగు మరియు తమిళం లో రాని క్రేజ్.

స్టార్ డమ్‌ అక్కడ లభించింది.దాంతో ఈ అమ్మడు అక్కడే సెటిల్‌ అయ్యింది.

తాప్సి కేవలం సినిమా ల్లో నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ సినిమాలు చేస్తూ ఉంది అంటే అక్కడ ఈ అమ్మడి క్రేజ్‌ స్టార్ డమ్‌ ను అర్థం చేసుకోవచ్చు.సమంత హీరోయిన్ గా తాప్సి ఒక సినిమా ను నిర్మిస్తుంది.

అంతే కాకుండా మరి కొన్ని సినిమా లు కూడా చర్చల దశలో ఉన్నాయి.సౌత్ నుండి ఉత్తరాదికి వెళ్లి ఇంతగా సక్సెస్‌ అయ్యింది మరెవ్వరు లేరు.

అందుకే తాప్సి కి మాత్రమే ఈ ఘనత దక్కింది.ఆమెది మాత్రమే ఈ రికార్డు అనడంలో సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube