అబ్బాయిలా మారే ప్రయత్నం చేసిన తమన్నా.. కానీ..?

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని తమన్నా 2021 సంవత్సరంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తున్న తమన్నా ఈ ఏడాది సత్తా చాటేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

 Heroine Tamannah Shocking Look Blooper Video Goes Viral,latest,tollywood News-TeluguStop.com

తమన్నా కబడ్డీ కోచ్ గా నటిస్తున్న సీటీమార్ సినిమా వచ్చే శుక్రవారం విడుదల కానుంది. గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

తమన్నా ఈ సినిమాకు తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పడం గమనార్హం.అయితే తాజాగా తమన్నా అబ్బాయిలా మారే ప్రయత్నం చేశారు.తమన్నా గుబురు మీసాలతో ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా గుబురు మీసాలలో తమన్నాను చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రమోషన్ కోసం తమన్నా తన లుక్ ను మార్చుకున్నారు.

అయితే తమన్నా మీసాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అవి కింద పడిపోతున్నాయి.

అయితే ఎంతో కష్టపడి చివరకు తమన్నా మీసాలను పెట్టుకున్నారు.

మీసాలలో తమన్నాను చూసిన నెటిజన్లు తమన్నా ఎలా ఉన్నా అందంగానే ఉంటారని కామెంట్లు చేయడం గమనార్హం.మీసాలు పెట్టుకున్నా తమన్నా అందం తరగలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.గుబురు మీసాల తమన్నా ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రమోషన్స్ లో భాగంగా మాణిక్కమ్ అనే పాత్ర కొరకు మిల్కీ బ్యూటీ ఇలా మీసాలను పెట్టుకున్నారు.

తమన్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోకు లక్షల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.మరోవైపు తమన్నా ఎఫ్ 3 సినిమాతో పాటు అంధాధూన్ రీమేక్ లో నటిస్తున్నారు.

ఈ ఏడాదే ఎఫ్ 3 సినిమాతో పాటు అంధాధూన్ విడుదల కానుండటం గమనార్హం.ఈ సినిమాలతో పాటు కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టైన లవ్ మాక్ టైల్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో తమన్నా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube