తండ్రి కారణంగా పెద్ద పెద్ద సినిమాలు మిస్సైన తమన్నా.. అంత హింస పెడితే?

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.

 Tamanna Miss Big Movies Because Of Her Father There Is So Much Violence, Tamanna-TeluguStop.com

ఇక తన నటనతో మాత్రం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇదిలా ఉంటే తన తండ్రి కారణంగా తమన్నాకు పెద్ద పెద్ద సినిమాలు మిస్ అయ్యాయట.

2005లో శ్రీ అనే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కానీ ఈ సినిమా తనకు అంత సక్సెస్ ఇవ్వలేదు.

ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక అప్పుడే హిందీ, కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టగా ఆ సినిమాలు కూడా తమన్నాకు నిరాశపరిచాయి.

ఆ తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ సినిమాలు మరింత సక్సెస్ ను అందించాయి.

ఇక ఎన్టీఆర్ తో ఊసరవెల్లి, రామ్ చరణ్ తో రచ్చ సినిమా లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలలో నటించగా ఈ సినిమాలు తన ఖాతాలో మంచి హిట్ గా నిలిచాయి.ఇక అలా వరుసగా నటించగా బాహుబలి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

Telugu Maestro, Seetimarr, Tamanna, Tamanna Santosh, Tamannamisses, Tamannah, To

అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది తమన్నా.తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే గతంలో తమన్నా పెద్ద పెద్ద సినిమాలను మిస్ అవ్వాల్సి వచ్చిందట.దానికి కారణం తండ్రి సంతోష్ భాటియా అని తెలిసింది.తన తండ్రికి కూడా చిన్నప్పటినుంచి సినిమాలంటే బాగా పిచ్చి అట.ఆ సమయంలోనే తను సినిమాలలో నటించడానికి బాగా ప్రయత్నించగా అసలు కుదరలేదట.

అలా తన కోరికను తన కూతురి ద్వారా నెరవేర్చుకున్నాడు.ఇక తమన్నా మొత్తానికి స్టార్ హీరోయిన్ గా ఎదిగాక.మరో పక్క తన తండ్రి ఆమెను నిర్మాతల దగ్గరికి వెళ్లి చిన్న చిన్న వేషాలు ఇప్పించమని బాగా ఇబ్బంది పెట్టాడట.దీంతో మొత్తానికి ఆయనకు ఓ సినిమాలో ఓ చిన్న పాత్రలో అవకాశం కూడా ఇచ్చారట.

దాంతో తనకు మళ్లీ సినిమాలలో నటించాలని ఆశ పెరిగిపోయిందట.

Telugu Maestro, Seetimarr, Tamanna, Tamanna Santosh, Tamannamisses, Tamannah, To

అలా దర్శక నిర్మాతలతో ఏకంగా బేరానికి దిగాడట.ఇక తమన్నా డేట్స్ లను కూడా స్వయంగా తానే మేనేజర్ లా ఉండి చూడటంతో తమన్నాకు బాగా టార్చర్ అయిందట.అలా చేయడం వల్ల ఆమెకు మంచి మంచి బ్యానర్స్ లో పెద్ద పెద్ద సినిమా అవకాశాలు మిస్ అయ్యాయట.

ఇక తన తండ్రి బాధను భరించలేక ఆమె తల్లి రజనీ, తన సోదరుడు ఆనంద్ లా సహాయంతో మళ్లీ అవకాశాలు అందుకుందట.అప్పట్లో తన తండ్రి విషయం అందరికీ తెలియడంతో ఆమెను అంత హింస పెడితే ఎలా అంటూ ఆయనపై బాగా విమర్శలు చేశారు.

ఇక తమన్నా ప్రస్తుతం పలు వరుస సినిమాలలో బిజీగా ఉంది.ఇక ఇటీవలే గోపీచంద్ నటించిన సిటీ మార్, నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఎఫ్3, గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా నటిస్తుంది.బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube