ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడతాను : తమన్నా

మారుతున్న కాలంతో పాటే చాలామందిని చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి.ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి.

 Heroine Tamanna Bhatia Share Weird Beauty Tips-TeluguStop.com

వీటిని తొలగించుకోవడానికి కొంతమంది క్రీములపై ఆధారపడుతుంటే మరి కొందరు లేజర్ చికిత్స చేయించుకుంటున్నారు.అయితే స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఉమ్మితో మొటిమలను నివారించవచ్చని చెబుతున్నారు.

వినడానికి ఈ మాటలు ఆశ్చర్యంగానే అనిపించిన ఒక ఇంటర్వ్యూలో తమన్నా ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

 Heroine Tamanna Bhatia Share Weird Beauty Tips-ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడతాను : తమన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమన్నా ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మార్నింగ్ సెలైవా కూడా తన స్కిన్ కేర్ ఐటెమ్స్ లో ఒకటని తెలిపారు.

ఉదయం నిద్ర లేచిన తరువాత ముఖానికి సలైవా అప్లై చేస్తానని తమన్నా వెల్లడించారు.చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలోస్ సలైవా ఉపయోగపడుతుందని తమన్నా పేర్కొన్నారు.ప్రస్తుతం తమన్నా ఎఫ్3, మ్యాస్ట్రో సినిమాలలో నటిస్తుండగా తాజాగా మ్యాస్ట్రో సినిమా షూటింగ్ పూర్తైంది.

Telugu Magazine Interview, Saliva, Tamanna Bhatia, Weird Beauty Tips-Movie

మరి తమన్నా చెప్పినట్టు ఉమ్మి నిజంగానే మొటిమలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందో లేదో చుడాల్సి ఉంది.తమన్నా ఈ విధంగా తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పకనే చెప్పేశారు.15 సంవత్సరాల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పటివరకు 50కు పైగా సినిమాలలో నటించడం గమనార్హం.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తమన్నా నటిగా సత్తా చాటారు.అన్ని రకాల పాత్రలు పోషిస్తూ తమన్నా నటిగా సత్తా చాటుతున్నారు.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా తమన్నా వెబ్ సిరీస్ లు, టీవీ షోలలో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.కొత్త హీరోయిన్ల నుంచి ఊహించని స్థాయిలో పోటీ ఎదురవుతున్నా తమన్నాకు సినిమా ఆఫర్లు తగ్గకపోవడం గమనార్హం.

మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పిన టిప్ ను ఆమె అభిమానులు కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి.

#Saliva #Tamanna Bhatia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు