ఇండస్ట్రీలో నన్ను దారుణంగా అవమానించారు : తాప్సీ

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది తాప్సీ.అందం అభినయం పుష్కలంగా ఉన్నా నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ కావడంతో తాప్సీ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Heroine Taapsee Sensational Comments About Film Industry And Heroes Behavior,tollywood News,comments Viral On Social Media-TeluguStop.com

ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఎదురైన దారుణమైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు

ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు సంపాదించడం వెనుక ఎంతో కష్టం ఉందని తాప్సీ తెలిపారు.

 Heroine Taapsee Sensational Comments About Film Industry And Heroes Behavior,tollywood News,comments Viral On Social Media-ఇండస్ట్రీలో నన్ను దారుణంగా అవమానించారు : తాప్సీ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని.కొందరు తనపై ఫ్లాప్ హీరోయిన్, ఐరన్ లెగ్ అని ముద్ర వేసి తన గురించి దుష్ప్రచారం చేశారని తెలిపారు.

తన అందంపై కూడా కొందరు నెగిటివ్ గా కామెంట్లు చేశారని కొందరు దర్శకనిర్మాతలు తనకు కావాలని అవకాశాలు ఇవ్వలేదని చెప్పారు

ఒక సినిమాలో తనకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని.హీరో భార్యకు నచ్చలేదనే వింత కారణంతో ఆ సినిమా నుంచి తనను తొలగించారని తెలిపారు.

ఒక సినిమాకు తాను డబ్బింగ్ చెప్పానని డబ్బింగ్ పూర్తైన తరువాత తన డబ్బింగ్ ను తొలగించి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించారని అన్నారు.కనీసం తనకు డబ్బింగ్ తొలగిస్తున్నట్టు సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు

మరో సినిమాలో హీరో గత సినిమా ఫ్లాప్ అయిందని తన రెమ్యునరేషన్ తగ్గించారని.

ఒక హీరో తన ఇంట్రడక్షన్ సీన్ హీరోయిన్ గా నటిస్తున్న తన ఇంట్రడక్షన్ సీన్ ను డామినేట్ చేస్తుందని సీన్ లో మార్పులు చేయించాడని ఇలా ఇండస్ట్రీలో ఎన్నో దారుణమైన అనుభవాలు తనకు ఎదురయ్యాయని తాప్సీ వెల్లడించారు.తాప్సీ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube