పెళ్లి ప్లాన్స్ చెప్పేసిన తాప్సీ.. బాయ్ ఫ్రెండ్ ఎవరంటే..?

ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై తెలుగులో చాలా సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయారు తాప్సీ.గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కు దూరమై బాలీవుడ్ కు పరిమితమైన తాప్సీ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Heroine Taapsee Interesting Comments About Marriage-tollywood-bollywood-social M-TeluguStop.com

బాలీవుడ్ లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్న తాప్సీ తాను వృత్తికి సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను వేరుగానే చూస్తానని అన్నారు.

లైఫ్ లో ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటానో వారికి బర్త్ డే సందర్భంగా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు పంచుకుంటానని అన్నారు.

బాయ్ ఫ్రెండ్ మథియాస్ బో విషయంలో కూడా అదే విధంగా చేశానని తాప్సీ తెలిపారు.ప్రస్తుతం రష్మీ రాకెట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న తాప్సీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాలను వెల్లడించారు.

Telugu Tapsee, Mathias Boe-Movie

సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేటింగ్ చేయాలని తాను అనుకోలేదని తాప్సీ పేర్కొన్నారు.ఆ తరువాత పెళ్లి ప్రణాళిక గురించి మాట్లాడిన తాప్సీ కెరీర్ విషయంలో ఇంకా ఎన్నో సాధించాలని తాను అనుకుంటానని చెప్పుకొచ్చారు.కెరీర్ లో ఆశించిన స్థాయికి చేరుకున్న తరువాతే పెళ్లి గురించి తాను ఆలోచిస్తానని తాప్సీ అన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పెళ్లి గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు.

పెళ్లి గురించి నిర్ణయం తీసుకునే సమయంలో ఎంపిక చేసుకునే ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తానని అన్నారు.ప్రస్తుతం మథియా బోతో డేటింగ్ లో ఉన్న తాప్సీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాల్సి ఉంది.

చాలామంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకోగా తాప్సీ మాత్రం వారికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube