సినిమా ఇండస్ట్రీలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సంగతి తెలిసిందే.ఈ ఇండస్ట్రీలో అందం, అభినయానికి అదృష్టం తోడైతే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో శ్రీలీల ముందువరసలో ఉన్నారు.పవన్ కళ్యాణ్, మహేష్, బాలయ్య, రామ్ సినిమాలలో నటిస్తూ ఇతర హీరోయిన్లను సైతం శ్రీలీల టెన్షన్ పడుతున్నారు.
ఇంట్లో కంటే షూటింగ్ సెట్స్ లోనే ఎక్కువగా ఉన్నానని ఆమె చెబుతున్నారంటే శ్రీలీలకు( sreeleela ) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థమవుతుంది.మరో మూడు సంవత్సరాల వరకు ఆమె డైరీ కూడా ఫుల్ అయిందని స్టార్ హీరోల సినిమాలకు మినహా ఇతర హీరోలకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాలయ్య( Balakrishna ) అనిల్ రావిపూడి కాంబో మూవీకి 80 లక్షల రూపాయల రేంజ్ లో శ్రీలీల పారితోషికం తీసుకున్నారు.

అయితే కొత్త సినిమాలకు మాత్రం శ్రీలీల ఏకంగా 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.అయితే పాత్ర నిడివిని బట్టి రెమ్యునరేషన్ విషయంలో శ్రీలీల మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.శ్రీలీల మరో ఐదేళ్ల పాటు శ్రీలీల వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉండే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.
శ్రీలీల సీనియర్ స్టార్స్ కు జోడీగా నటించడానికి కూడా ఓకే చెబుతున్నారు.

ధమాకా సినిమాతో( Dhamaka ) సక్సెస్ సాధించడం శ్రీలీలకు కెరీర్ పరంగా కలిసొస్తుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.శ్రీలీల కెరీర్ విషయంలో జాగ్రత్త వహించి మంచి కథలను ఎంచుకుంటే మాత్రం ఆమె కెరీర్ కు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శ్రీలీల రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.
శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
