మళ్లీ రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన శ్రీలీల.. అంత డిమాండా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది.ఒక్క సినిమాతో సక్సెస్ సాధిస్తే కొంతమంది హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

 Heroine Srileela Hikes Her Remuneration Details Here Goes Viral , Heroine Srilee-TeluguStop.com

అలా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ లో వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ గా శ్రీలీల పేరు సంపాదించుకోవడం గమనార్హం.అయితే ఈ యంగ్ హీరోయిన్ కు ధమాకా మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో చేరిందనే సంగతి తెలిసిందే.

పెళ్లిసందడి, ధమాకా సినిమాల ఫలితాలతో శ్రీలీల జాతకం మారిపోయింది.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ, బాలయ్య అనిల్ కాంబో మూవీ కూడా సక్సెస్ సాధిస్తే మాత్రం రష్మిక, పూజా హెగ్డేలను మించి శ్రీలీల ఇండస్ట్రీలో క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు నంబర్ వన్ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే బాలయ్య అనిల్ కాంబో మూవీకి శ్రీలీల కోటి రూపాయలు డిమాండ్ చేసిన సమయంలోనే కుర్ర హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం కరెక్టేనా? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.

అయితే శ్రీలీల ప్రస్తుతం ఆ పారితోషికంను రెట్టింపు చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లకు కాకపోయినా భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు 2 కోట్ల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ను అందుకోవడానికి ఈ టాలీవుడ్ బ్యూటీ సిద్ధమయ్యారని తెలుస్తోంది.రెమ్యునరేషన్ విషయంలో శ్రీలీల సరైన దారిలో ముందడుగులు వేస్తున్నారని కొంతమంది చెబుతుండగా మరి కొందరు మాత్రం శ్రీలీల అడుగులు తప్పటడుగులు అని చెబుతున్నారు.

Telugu Dhamaka, Srileela, Pellisandad, Tollywood-Movie

రెమ్యునరేషన్ ను భారీగా పెంచడం వల్ల ఒక్క ఫ్లాప్ వచ్చినా శ్రీలీలకు ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సందేహించే పరిస్థితి ఏర్పడుతుంది.స్టార్ స్టేటస్ వచ్చే వరకు శ్రీలీల తప్పటడుగులు వేయవద్దని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.ఈ కామెంట్లను పట్టించుకొని కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా శ్రీలీల జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube