రెండో పెళ్లికి రెడీ అంటున్న హీరోయిన్..!

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.కానీ చిత్ర పరిశ్రమలో నటులు పెళ్లి బాజాలు మోగిస్తూనే ఉన్నారు.

 Sonia Agarwal Second Marriage, Sonia Agarwal , Selva Raghavan-TeluguStop.com

నితిన్ పెళ్లి పీటలు ఎక్కుతుండగా తాజాగా మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అయ్యినట్లు సమాచారం.ఆమె మరెవ్వరో కదండీ 7/G బృందా‌వ‌న కాల‌నీ’ ఫేమ్ సోనియా అగ‌ర్వాల్ రెండో పెళ్లికి సిద్దమైనట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.వరుస సంకేతాలతో తన పెళ్లి మ్యాటర్ రివీల్ చేసింది.

తాజాగా ‘7/G బృందా‌వ‌న కాల‌నీ’ ఫేమ్ సోనియా అగ‌ర్వాల్ రెండో పెళ్లికి సిద్దమైనట్లు సమాచారం.ఆమె మొన్న పోస్ట్ చేసిన వీడియోలో వధువు మెడలో వరుడు తాళి కడుతున్న వీడియో షేర్ చేసి తన రెండో పెళ్లి మ్యాటర్‌పై చిన్న హింట్ ఇచ్చింది.

ఆ తర్వాత నిన్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ల‌కు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేస్తూ మరో రెండు రోజులే అని పేర్కొంది.కారుపై 25-07-2020 అని రాసి ఉన్న పిక్ పోస్ట్ చేస్తూ మరొక్క రోజు మాత్రమే అని తెలిపారు.

దీన్ని బట్టి చూస్తే శనివారం అమ్మడు రెండో పెళ్లి చేసుకోబోతోందని స్పష్టమవుతోందని సమాచారం.

అయితే గతంలో ఆమె తమిళ సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు సెల్వ రాఘవన్‌‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.2006 లో పెళ్లి చేసుకున్న ఈ జోడీ మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో 2010లో విడిపోయారు.ఆ తర్వాత సోనియా అగర్వాల్ ఆయనతో విడాకులు తీసుకున్నారు.

అయితే అప్పటి నుంచి దాదాపు పదేళ్లు ఒంటరిగానే ఉన్న సోనియా అగర్వాల్.ఇప్పుడు మరో పెళ్ళికి సిద్దమైనట్లు సంకేతమివ్వడంతో రేపే సోనియా రెండో పెళ్లి అని అంతా ఫిక్సయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube