ఆ దంపతులు కేవలం యాడ్స్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా..?

సినిమాలే కాదు యాడ్స్ తో కూడా మంచి సంపాదన.అలాగే వారి నైపుణ్యాని పెంచుకోవచ్చు అని ఒక జంట నిరూపించారు.

 Heroine Sneha And Her Husband Earning Crores Of Rupees Through Ads-TeluguStop.com

వారు ఎవరో కాదు మనందరికీ బాగా తెలిసిన నటులు.హీరోయిన్ స్నేహ.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని నటి.ఆమె హీరో తరుణ్ సరసన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి “ప్రియమైన నీకు” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.స్నేహ నటించిన మొదటి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో స్నేహకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.అంతేకాదు ఆమెకు మంచి అవకాశాలు లభించాయి.హనుమాన్ జంక్షన్, వెంకీ, రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు వంటి చిత్రాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది.అంతేకాదు ఈమెను మరో సౌందర్యగా ప్రేక్షకులు ఆదరించారు.

 Heroine Sneha And Her Husband Earning Crores Of Rupees Through Ads-ఆ దంపతులు కేవలం యాడ్స్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే తాను నటించిన సినిమాలన్నింటిలోనూ గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం కథా నైపుణ్యం ఉన్న సినిమాలలో నటించేది.

ఇండస్ట్రీ లోకి కొత్త హీరోయిన్స్ వచ్చేటప్పటికి మంచి గుర్తింపును సంపాదించుకున్న స్నేహకు అవకాశాలు తగ్గిపోయాయి.

అదే సమయంలో తమిళంలోనూ మంచి ఆఫర్లు రావడంతో తమిళం వైపు వెళ్లిన స్నేహ అక్కడ కూడా ‘అచ్చాముందు! అచ్చాముందు!’ అనే సినిమా చేస్తున్న సమయంలో నటుడు ప్రసన్నతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

Telugu About Heroine Sneha, Advertisement, Cinima, Crores, Crores Of Rupees, Heroine Sneha Ads, Heroine Sneha And Husband, Income, Movies, Prasanna, Sneha Pair, Tv Ads, Viral News-Latest News - Telugu

ప్రస్తుతం హీరోయిన్ గా నటించే అవకాశాలు రాకపోవడంతో.స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ సందడి చేయడమే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.భార్యాభర్తలు కలిసి ఇదివరకే ‘కంఫర్ట్ ఫాబ్రిక్’ ‘ఆశీర్వాద్’ ‘సన్ ఫీస్ట్ మ్యారి లైట్’ ‘విమ్’ ‘జి.ఆర్.టి జ్యుయలర్స్‘ వంటి ఎన్నో యాడ్స్ లో నటించారు.ఇవే కాకుండా స్నేహ ఒక్కటే ‘వైభవ్ కలెక్షన్స్’, ‘ఆశీర్వాద్ గులాబ్ జామ్’ వంటి యాడ్స్ లో కూడా కనిపించారు.ఇప్పటి వరకు సుమారుగా రూ.2.87 కోట్ల రూపాయలు ఈ విధంగా వీరి జంట పలు యాడ్స్ లో నటిస్తూ సంపాదించినట్టు తెలుస్తోంది.

#Crores #Cinima #Heroine Sneha #Heroine Sneha #Sneha Pair

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు