తనను మోసం చేశాడని చిరంజీవి చెంప పగలగొట్టిన హీరోయిన్..

చిరంజీవి.తన అద్భుత నటనతో మెగాస్టార్ గా జనాల మనసుల్లో నిలిచిపోయాడు.

 Heroine Slapped Hero Chiranjeevi, Chirenjeevi , Radhika, Kranthi Kumar, Nyayam K-TeluguStop.com

ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తిరుగులేని యాక్టర్ గా నిలిచిపోయాడు.తెలుగు సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్లు కొట్టి తన సత్తా చాటాడు.

వరుస విజయాలతో ముందుకు సాగుతూ దశాబ్దాలుగా టాప్ హీరోగా చలామణి అవుతున్నాడు.అలాంటి చిరంజీవిని ఓ లేడీ చెంప చెల్లుమనిపించింది.

ఇంతకీ చిరుపై చేయి చేసుకున్న ఆవిడ ఎవరో ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి, రాధిక హీరో, హీరోయిన్లుగా పలు సినిమాలు చేశారు.

నిజానికి చిరుతో రాధిక నటించిన తొలి మూవీ ప్రియ.కానీ.

విడుదలైన తొలి సినిమా మాత్రం న్యాయం కావాలి.ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా.

క్రాంతి కుమార్ నిర్మించాడు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా విజయం తర్వాత చిరంజీవి, రాధిక మంచి ఫ్రెండ్స్ అయ్యారు.అనంతరం ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు.

అంతేకాదు.చిరంజీవి మద్రాస్ శ్రీనగర్ లో నివాసం ఉండేవాడు.

ఆయన ఇంటి పక్కనే రాధిక ఉండేది.తరుచుగా చిరు ఇంటికి వెళ్లేది రాధిక.

మొత్తంగా ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు.

Telugu Chirenjeevi, Kranthi Kumar, Nyayam Kavali, Radhika, Tollywood-Telugu Stop

అటు న్యాయం కావాలి సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి, రాధిక సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా పలు ఆసక్తి కవర విషయాలు జరిగాయి.ఈ సినిమాలో చిరంజీవి రాధికను మోసం చేసే పాత్రలో నటించాడు.రాధికను లవ్ చేశానని చెప్పి శారీరకంగా ఆమెను అనుభవిస్తాడు.

ఆ తర్వాత తనను వదిలించుకోవాలి అనుకుంటాడు.తనను ఎందుకు మోసం చేశావని చిరంజీవిని రాధిక అడుగుతూ.

చిరంజీవి చెంప చెల్లుమనిపిస్తుంది.ఈ సీన్ లో చాలా డైలాగులు ఉంటాయి.

ఈ సీన్ కోసం నిజంగానే తన చెంపపై కొట్టాలని చిరంజీవి చెప్తారు.ఈ షాట్ సరిగా రాకోవడంతో రీటేక్ చేయాల్సి వచ్చింది.

ఈ టేకుల్లో చిరంజీవి చెంపను పగలగొట్టింది రాధిక.షాట్ ఓకే అయ్యింది.

కానీ చిరంజీవి చెంప వాచిపోయింది.ఆ తర్వాత కాస్త క్రీమ్ పూసి తగ్గేలా చేశారట.

అటు చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా రాధిక రికార్డు సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube