పోతుంది అనుకున్న ప్రతిసారి భారీ ప్రాజెక్ట్ లో చోటు సంపాదిస్తున్న శ్రియ

సీనియర్ హీరోయిన్ శ్రియా సరణ్ 2001లో అనగా ఇరవై ఏళ్ల కిందట హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి నేటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.భారీ ప్రాజెక్టుల్లో స్పెషల్ రోల్స్ ప్లే చేస్తూ దూసుకుపోతున్నది.

 Heroine Shriya Career Up And Downs , Shriya, Shankar, Mega Star Chiranjeevi, Dir-TeluguStop.com

శ్రియ కెరీర్ ఇక అయిపోయిందనుకునే లోపు మళ్లీ వెండితెరపైన కనిపించి సత్తా చాటుకుంటోంది.తాజాగా జీనియస్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న మూవీలో కీ రోల్‌కు ఎంపికైంది.

Telugu Shankar, Shriyacareer, Chiranjeevi, Rajinikanth, Shriya-Telugu Stop Exclu

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ ఎప్పటి నుంచో తెలుగు హీరోతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు.కాగా ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది.రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా సినిమా పూజా కార్యక్రమం ఇటీవల జరిగింది.అయితే, మెగా స్టార్ చిరంజీవి చాలా కాలం నుంచి శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

అయితే, చిరు కోరిక నేరవేరలేదు.కానీ, ఆయన తనయుడు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.

దాంతో మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.ఈ సంగతులు ఇలా ఉంచితే.

సీనియర్ హీరోయిన్ శ్రియా సరణ్ తెలుగు చిత్రాలలో చాలా కాలం పాటు కనబడలేదు.ఆ సమయంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మనం’ చిత్రంలో ఆఫర్ వచ్చింది.

అలా అప్పుడు మెరిసిన ఈ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’లో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

శ్రియా సరణ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రం కోసం ప్రపంచ సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇకపోతే శంకర్ దర్శకత్వంలో వచ్చే చరణ్ చిత్రంలో శ్రియ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.గతంలో డైరెక్టర్ శంకర్ – సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన ‘శివాజీ’ చిత్రంలో శ్రియ కథానాయికగా నటించింది.

ఆ సినిమాలోని పాటలకు శ్రియ వేసిన స్టెప్పులు ఇప్పటికీ హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube