మరో చరిత్ర తర్వాత హీరోయిన్ సరిత జీవితంలో చోటు చేసుకున్న మార్పులు

Heroine Saritha About Her Life Before And After Maro Charitra

దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత చిత్రం మరో చరిత్ర.ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన నటించిన హీరోయిన్ సరిత.ఓకే సినిమాతో ఎంతో పేరు సంపాదించింది ఈ మద్దుగుమ్మ.నిజానికి సరిత అసలు పేరు అభిలాష.

 Heroine Saritha About Her Life Before And After Maro Charitra-TeluguStop.com

ఆమెను వెండి తెరపై సరితగా అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు.తొలి సినిమాలోనే అప్పటి టాప్ హీరో కమల్ హాసన్ తో నటించింది సరిత.

అంతేకాదు తన ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో సరితకు డబుల్ బొనాంజా దక్కినట్టైంది.ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసికల్ గా నిలిచింది.

 Heroine Saritha About Her Life Before And After Maro Charitra-మరో చరిత్ర తర్వాత హీరోయిన్ సరిత జీవితంలో చోటు చేసుకున్న మార్పులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాల్లోకి రాకముందు.వచ్చిన తర్వాత ఓ అమ్మాయి జీవితం లా మారిపోతుందో తెలుగుసుకోవాలంటే సరితను ఉదాహారణగా చెప్పుకోచ్చు.

అంతేకాదు.తన జీవితంలో గతానికి, ప్రస్తుతానికి మధ్య తేడా ఏంటో ఆమె స్వయంగా డైరీలో రాసుకున్నది.

ఇంతకీ తన గురించి ఏం రాసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమాల్లోకి రాకుముందున్న అభిలాషకి, సినిమాల్లోకి వచ్చిన తర్వాత సరితకు చాలా తేడా ఉన్నట్లు చెప్పింది.అభిలాషకు ఇన్ కమ్ టాక్స్ స్పెల్లింగ్ కూడా తెలియదు.కానీ సరిత నిత్యం దాని గురించే ఆలోచిస్తుంది.

అభిలాష స్కూల్లో ఉండగా చాలా లావుగా ఉండేది.ఏదిపడితే అది తినేది.

కానీ ప్రస్తుతం సరిత నోటిని కట్టిపెట్టుకుని ఉంది.ఏం తినాలన్నీ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది.

గతంలో తొమ్మిది గంటలకే పడుకునే అభిలాష.ప్రస్తుతం రాత్రి, పగలు అని తేడా లేకుండా పని చేస్తుంది సరితగా మారి.

అప్పటికి ఇప్పటికీ బాధ కలింగించే విషయం ఏంటంటే.అప్పట్లో చాలా మంది ఫ్రెండ్ ఉండేవారు.ఇప్పుడు చాలా తక్కువయ్యారు.అప్పుడు ఫ్రెండ్స్ తో చాలా విషయాలు మాట్లాడేదాన్ని.ప్రస్తుతం ఎవరితో ఏం మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది కలుగుతుందోననే భయం ఉంది.ప్రస్తుతం మనుషులతో మాట్లాడాలంటే తెచ్చిపెట్టుకున్న ప్రేమతో మాట్లాడుతున్నా.

గతంలో మనస్ఫూర్తిగా మాట్లాడేది.గతంలో చాలా ఫ్రీగా ఉండే అభిలాష.

ఇప్పుడు ఎన్నో ప్రెషర్లు ఎదుర్కొంటుంది.అప్పటి అభిలాష చాలా అమాయకురాలు.

సరితకు మాత్రం లోకం ఎలా ఉందో కాస్త తెలిసి వచ్చింది.మొత్తంగా గతం, వర్తమానాల కలయికతో సాగిపోతుంది నా జీవితం.

#SarithaBee #Maro Charitra #Saritha #Maro Charitra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube