టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత ( Samantha ) ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఈమె కమిట్ అయినటువంటి ఖుషి ( Khushi ) సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు.
ఇలా ఈ రెండు షూటింగ్ పూర్తి కావడంతో ఈమె సినిమాలకు విరామం ఇవ్వబోతున్నారని ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది.అయితే సమంత ఇలా ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వడానికి కారణం తనకు మయో సైటిసిస్(Myositis) వ్యాధి పూర్తిగా నయం కాలేదని ఆ వ్యాధి చికిత్స కోసమే విరామం ప్రకటించారని తెలుస్తోంది.

ఇక సమంత చికిత్స కోసమే అమెరికా వెళుతున్నారని తన హెయిర్ స్టైలిస్ట్ కూడా అధికారికంగా తెలిపారు.ఈ విధంగా సమంత మరికొద్ది రోజులలో చికిత్స ( Samantha Treatment ) కోసం అమెరికా వెళుతున్న నేపథ్యంలో దైవ దర్శనాలకు వెళ్తూ మనోధైర్యాన్ని నింపుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె తమిళనాడు వేలూరులోని గోల్డెన్ టెంపుల్ ( Vellore Golden Temple ) ని సందర్శించారు.ఇలా గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజల చేయించినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో అభిమానులు చికిత్స కోసం అమెరికా వెళుతున్న నేపథ్యంలో తనకు మనో ధైర్యం ప్రసాదించమని ఇలా దైవదర్శనాలకు వెళ్తున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

విడాకుల తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా అయినటువంటి ఈమెను మయోసైటీస్ వ్యాధి( Myositis ) వెంటాడింది.ఈ వ్యాధి కారణంగా కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత తిరిగి తాను కమిట్ అయినటువంటి సినిమాలు వెబ్ సిరీస్లను పూర్తి చేసింది.అయితే పూర్తిగా ఈ వ్యాధి నుంచి కోలుకోని పక్షంలో ఈమె ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించి ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.ఇక సమంత చికిత్స కోసం వెళ్తున్నారని తెలియడంతో తను క్షేమంగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.