ఆటో డ్రైవర్ కు అక్కినేని కోడలు ఊహించని గిఫ్ట్..!

తెలుగు సినీ నటి అక్కినేని కోడలు సమంత నటన విషయంలో స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది.ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పలు విషయాలు తెలుపుతూ బిజీగా ఉండే సమంత.

 Heroine Samantha Surprising Gift Auto Driver Kavitha-TeluguStop.com

ప్రజలకు అవగాహన కల్పించే వర్కవుట్ల గురించి తెలుపుతూ ఉంటుంది.అంతే కాకుండా సమాజ సేవ లకు కూడా అక్కినేని కోడలు బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఆటో డ్రైవర్ కు ఊహించని గిఫ్ట్ ఇవ్వగా సమంత పట్ల మరింత గౌరవం అభిమానులలో పెరిగింది.

 Heroine Samantha Surprising Gift Auto Driver Kavitha-ఆటో డ్రైవర్ కు అక్కినేని కోడలు ఊహించని గిఫ్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన కవిత అనే ఓ ఆటో డ్రైవర్.

ఈమెకు ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ప్రైవేట్ ప్రోగ్రాంలో ఆహ్వానం అందింది.ఇక ఆమె తన జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలపగా.

తనకు బాల్య వివాహం జరిగిందని, భర్త తాగొచ్చి కొట్టేవాడని తెలిపింది.ఇక అతని వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి అక్కడ పొలం పనులు చూసుకుంటూ తన ఏడుగురు చెల్లెళ్లను పోషిస్తుంది.

తన తల్లిదండ్రులు చనిపోవడంతో తన కుటుంబం భారమంతా ఆమెపై పడగా.ఆమె ఆటో డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాదులో మియాపూర్ నుండి బాచుపల్లి వరకు ఆటో నడుపుతూ తన జీవనాన్ని, కుటుంబాన్ని పోషిస్తుంది.

ఇక ఈ విషయం విన్నాక అక్కడ నిర్వాహకులు తన గురించి యూట్యూబ్ లో పోస్ట్ చేశారని ఆమె తాజాగా తెలిపింది.అంతేకాకుండా ఆ వీడియోని చూసి తనకు తాజాగా సమంత గిఫ్ట్ కూడా ఇచ్చిందని తెలిపింది.

ఆమెకు షోరూమ్ నుంచి ఫోన్ కాల్ రాగా.ఆమెను గురువారం సాయంత్రం బంజర హిల్స్ లో ఉన్న మారుతి షోరూం కు రమ్మని తెలిపారు.దీంతో ఆమె అక్కడికి చేరుకోగా నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువైన స్విఫ్ట్ డిజైన్ కార్ ను అందజేశారు.ఈ గిఫ్ట్ ను సమంత కవితకు అందజేయగా.

ప్రస్తుతం కవిత సంతోషానికి అవధులు లేకుండా పోయింది.ఇంత మంచి పని చేసిన సమంతకు అభిమానుల నుండి ప్రశంసలు వస్తున్నాయి.

#Samantha #Surprising Gift

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు