సమంత హర్టయ్యింది గురూ.. ఇదిగో ఇదే ప్రూఫ్.. మరీ ఇంతలా బాధపడితే ఎలా అబ్బా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నటువంటివారిలో అక్కినేని నాగచైతన్య సమంత జంట ఒకటని చెప్పవచ్చు.వీరిద్దరూ ఏడు సంవత్సరాలు ప్రేమించుకుని అనంతరం పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.

 Samantha Is Heart Broken In Divorce Issue Here Is The Proof Details, Samantha, T-TeluguStop.com

ఇలా ఈ దంపతులు విడాకులు ప్రకటన చేయడంతో చాలా మంది సమంత విడాకులు తీసుకోవడానికి కారణం సమంతదే తప్పు అన్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

అయితే విడాకుల ప్రకటన ముందు నుంచి సమంత విడాకుల విషయంలో ఎంతో బాధ పడినట్లు పలు సందర్భాలలో బయటపడింది.

ఈ క్రమంలోనే విడాకుల ప్రకటనతో తాను ఎలాంటి బాధను అనుభవించినదో ఇండైరెక్ట్ గా ఆ బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఇప్పుడిప్పుడే సమంత తన బాధ నుంచి బయట పడుతూ పూర్తిగా తన దృష్టిని తన కెరియర్ పై పెట్టినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈమె వరుస సినిమాలకు సిగ్నల్ ఇస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ గా మారడానికి సిద్ధమయ్యారు.

సమంత విడాకుల విషయం గురించి తన బాధను పలు సందర్భాలలో బయటపెట్టినప్పటికి నాగచైతన్య మాత్రం ఈ విషయం గురించి ప్రస్తావించకపోవడంతో తప్పు మొత్తం చైతన్య దేనని ఈమె నాగ చైతన్య నుంచి విడిపోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది.

అయితే విడాకుల విషయంలో సమంత చాలా హర్ట్ అయింది తెలుస్తోంది.సాధారణంగా విడాకులు తీసుకున్న ఎన్నో జంటలు స్నేహితులుగా ఎంతో మంచిగా మెలుగుతున్నారు.

Telugu Heartbroken, Nagachaitanya, Proof, Samantha, Samanthapet, Tollywood-Movie

కానీ సమంత నాగచైతన్య విషయంలో అది జరగడం లేదని తెలిసిపోయింది.విడాకుల తర్వాత స్నేహితులుగా ఉంటామని చెప్పిన ఈ జంట కనీసం స్నేహితులుగా కూడా వారి బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నవంబర్ 23 వ తేదీ నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో సమంత ఒక స్నేహితురాలిగా కూడ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు.కానీ తన పెట్ డాగ్ హాష్ కి మాత్రం పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Telugu Heartbroken, Nagachaitanya, Proof, Samantha, Samanthapet, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు స్పందించారు.కనీసం ఒక స్నేహితురాలిగా సమంత నాగ చైతన్య పుట్టిన రోజు శుభాకాంక్షలను చెప్పలేదు సరి కదా తన కుక్కకు బర్త్ డే సెలబ్రేట్ చేయడంతో నాగచైతన్య విడాకుల విషయంలో సమంత చాలా హర్ట్ అయిందనీ, అందుకు ప్రూఫ్ కూడా ఇదేనని మరీ చైతన్య పై ఇంత కోపం ఏంటి సామ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక సమంత నాగ చైతన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయకపోవడంతో మరోసారి వీరి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Telugu Heartbroken, Nagachaitanya, Proof, Samantha, Samanthapet, Tollywood-Movie

ఇక సమంత విషయానికి వస్తే ప్రస్తుతం ఈమే శాకుంతలం సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.నాగచైతన్య కూడా తాను కమిట్ అయినటువంటి థాంక్యూ, బంగార్రాజు వంటి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ విధంగా విడాకులతో విడిపోయిన ఈ జంట పూర్తిగా తమ కెరియర్ పై దృష్టి సారించారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube