నా బాడీ షేప్ పై చీప్ కామెంట్స్ చేశారు.. స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లను చూడగానే వాళ్లకేంటి వాళ్ళ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది ఏ బాధలో ఉండవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.కానీ అదంతా అపోహ మాత్రమే.

 Heroine Saiyami Kher Face Body Shaming Details, Saiyami Kher, Body Shaming, Comm-TeluguStop.com

ఎందుకంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా రాణిస్తున్న వారు ఒకప్పుడు కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను చేదు సంఘటనలను ఎదుర్కొన్నవారే.అయితే హీరో హీరోయిన్లు వారి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను సమయం సందర్భం లేదా ఏదైనా ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు.

ఆ సమయంలో ఈ హీరో అంత కష్టపడి పైకి ఎదిగాడా అన్ని అవమానాలను ఎదుర్కొన్నారా అని ఫీల్ అవుతూ ఉంటారు.

తాజాగా కూడా ఒక హీరోయిన్ తన కెరియర్ ఆరంభంలో ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

ఆ హీరోయిన్ ఎవరు ఆమె ఎటువంటి అనుభవాలను ఎదుర్కొంది అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆమె మరెవరో కాదు మరాఠీ బ్యూటీ సయామీ ఖేర్. ఈమె మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా రేయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఈమె, హిందీ మరాఠీ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా మారింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ఫాదూ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

Telugu Face, Saiyami Kher, Rey-Movie

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.తాను కూడా బాడీ షేమింగ్ బారిన పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.నటిగా తన కెరీర్ ప్రారంభంలో లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలని వెటకారంగా మాట్లాడేవారని,కానీ వాటిని పట్టించుకునే దాన్ని కాదు అని ఆమె తెలిపింది.ఎవరైనా సరే నా శరీరం గురించి మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది.

కాస్త మందంగా ఉండటం వల్ల అలాంటి వ్యాఖ్యలకు బాధపడలేదు.కానీ అలాంటి చీప్ కామెంట్స్ చేయడం మాత్రం చాలా విచారకరం.

ఎవరైనా సరే ఇతరుల బాడీ గురించి మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి.సమాజంలో చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నారు.

మనం ఒకరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే అవతలి వారికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది సయామీ ఖేర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube