చైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయిపల్లవి.. బాగా చేస్తాడంటూ?

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే.సాయిపల్లవి డ్యాన్స్ కోసమే సినిమాలను చూసే అభిమానులు సైతం ఇండస్ట్రీలో ఉన్నారు.

 Heroine Saipallavi Shocking Comments About Nagachaitanya,latest Tollywood News-TeluguStop.com

సాయిపల్లవితో పోటీ డ్యాన్స్ చేయాలంటే తేలిక కాదు.స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు రాకపోయినా సాయిపల్లవికి ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతన్య సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ డ్యాన్స్ బేస్డ్ మూవీ అనే సంగతి తెలిసిందే.

Telugu Nagachaitanya, Saipallavi-Movie

లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య కూడా జుంబో డ్యాన్స్ ఇన్ స్ట్రక్చర్ గా చేయగా ఒక ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డానని వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే లవ్ స్టోరీ సినిమాలో మాత్రం సాయిపల్లవితో పోటీ పడి చైతన్య స్టెప్పులు వేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ లవ్ స్టోరీ మూవీలో చైతన్య చాలా బాగా డ్యాన్స్ చేశారని చెప్పారు.

సినిమాలో రైన్ సాంగ్, సారంగ దరియా పాటకు డ్యాన్స్ చేయడం కష్టమైందని సాయిపల్లవి అన్నారు.ఎంతో కష్టపడి సారంగదరియా, రైన్ సాంగ్ చేశానని సాయిపల్లవి తెలిపారు.

సాయిపల్లవి, నాగచైతన్యల కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.చైతన్య కెరీర్ లో లవ్ స్టోరీ బెస్ట్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాతో చైతన్య 50 కోట్ల షేర్ కలెక్షన్లు సాధిస్తాడని అనుకుంటున్నారు.

Telugu Nagachaitanya, Saipallavi-Movie

నాగచైతన్య, సాయిపల్లవి తొలిసారి కలిసి ఈ సినిమాలో నటిస్తుండగా శేఖర్ మాస్టర్ ఈ సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ అందించారు.ఫిదాకు భిన్నమైన కథను తెరకెక్కిస్తున్న శేఖర్ మాస్టర్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.సాయిపల్లవి ఈ మూవీతో ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube