ఎవరికీ డౌట్ రాకుండా థియేటర్ కు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

సినీ ఇండస్ట్రీలో చాలామంది వారు నటించిన సినిమాలకు థియేటర్ ల వద్ద, థియేటర్లలో రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది, సినిమాలో మంచి మంచి సన్నివేశాలకు ప్రేక్షకులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు తెలుసుకోవడానికి నటీనటులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే థియేటర్ కు వచ్చి ప్రేక్షకులతో పాటు కలిసి సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.

 Sai Pallavi Visits To Sree Ramulu Thatre In Mosapet For Shyam Singha Roy Details-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ లో ఒక హీరోయిన్ బురఖా వేసుకుని థియేటర్ కు వచ్చి సినిమా చూసింది.అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరి బురఖా ధరించి థియేటర్ కు వచ్చిన ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా? మరెవరో కాదు ఆ హీరోయిన్ సాయి పల్లవి.సాయి పల్లవి నాని జంటగా నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్.

ఈ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 20 కోట్లు వసూలు చేసింది.

తాజాగా సినిమా రెస్పాన్స్ చూడడానికి బురఖా వేసుకుని దర్శకుడు రాహుల్ తో పాటు హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీ రాములు థియేటర్ కు వచ్చింది.

Telugu Burkha, Krithi Shetty, Nani, Rahul, Sai Pallavi, Saipallavi, Shyam Singha

అయితే ప్రేక్షకులు తనను గుర్తు పట్టకుండా ఉండటానికి బురఖా లో వెళ్ళింది సాయి పల్లవి.ఇందుకు సంబంధించిన వీడియో ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కానీ కొద్దిసేపటికే ఆ వీడియోని తొలగించారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమాలో సాయి పల్లవి,కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లు అన్న విషయం తెలిసిందే.

ఇందులో నాని ద్విపాత్రాభినయం లో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube