గోరింటాకు పెట్టుకున్న హీరోయిన్.. వైరల్ ఫోటోలు.. ఎవరంటే?

ఈ మధ్య హీరోయిన్లు సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు.ట్రెండీగా తయారైన ఏవైనా వస్తువులు కొన్న సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పంచుకుంటారు.

 Heroine Sai Pallavi Gorinta Viral Photos-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ గోరింటాకు పెట్టుకుని మరీ అభిమానులకు చూపించింది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.

టాలీవుడ్ హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి.ఫిదా సినిమా తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలలో కూడా నటించి తనకంటూ సక్సెస్ అందుకుంది.తెలుగులో నటించిన సినిమాలలో ఎంతో హోమ్లీ గా కనిపిస్తుంది సాయిపల్లవి.

 Heroine Sai Pallavi Gorinta Viral Photos-గోరింటాకు పెట్టుకున్న హీరోయిన్.. వైరల్ ఫోటోలు.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ తో పాటు విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

నిజానికి సాయి పల్లవి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు.కానీ అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ఫోటోలను, సినిమా అప్ డేట్ లను షేర్ చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.అందులో తన చేతికి, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంది.పైగా కుడి చేతికి గోరింటాకు పెట్టుకోలేనని చెప్పుకొచ్చింది.ఇక ఏ సందర్భంలో గోరింటాకు పెట్టుకుందో కానీ గోరింటాకును చూసుకుని తెగ మురిసిపోతుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా.నెటి జనులు ఏం స్పెషల్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Gorinta, Sai Pallavi, Tollywood, Viral Photos-Movie

ఇక ప్రస్తుతం వేణు దర్శకత్వంలో విరాటపర్వం సినిమాలో రానా సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అంతేకాకుండా ప్రియమణి కూడా నటిస్తుంది.ఇక ఇదే కాకుండా శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా బిజీగా ఉంది.ఇదిలా ఉంటే నాగచైతన్య తో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదల డేట్ ను కూడా ప్రకటించారు.

కానీ లాక్ డౌన్ తో విడుదల వాయిదా పడింది.

#Sai Pallavi #Gorinta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు