బాలయ్య చిన్న పిల్లాడు.. నటి సదా షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ నటి సదా పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకులందరికి తెలిసిందే.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సదా.

 Actress Sadha Sensational Comments On Balakrishna, Balakrishna, Sadha, Sadha Abo-TeluguStop.com

స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.అంతేకాకుండా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను తాకింది.

వెండితెరపై కాకుండా బుల్లితెరలో కూడా అభిమానులకు మరింత దగ్గరయ్యింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
జయం సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సదా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలతో మంచి గుర్తింపు అందుకుంది.

తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకుంది.స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది సదా.ఇక బుల్లితెరపై ఢీ షో లో జడ్జిగా కూడా చేసింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ బాలయ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

బాలయ్య తో కలిసి వీరభద్ర సినిమా లో నటించిన సదా తాజాగా ఆయన గురించి కొన్ని విషయాలు పంచుకుంది.తాజాగా ఆలీతో సరదాగా షో లో పాల్గొన్న సదా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.ఇక తన తొలి సినిమా జయం గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకోగా గతంలో జరిగిన ప్రమాదం గురించి కూడా తెలిపింది.ఇక ఆలీ బాలయ్య, ఎన్టీఆర్ ల గురించి ప్రశ్నించగా.

బాలయ్య చిన్న పిల్లవాడని ఎలా ఉంటారో అలాగే ఉంటారని తెలిపింది.ఇక ఎన్టీఆర్ తో కూడా నాగ సినిమాలో నటించింది సదా.దీంతో ఆయన నటనను చూసిన సదా ఎన్టీఆర్ లా డాన్స్ చేసే వారిని ఇంతవరకు చూడలేదని తెలిపింది ఈ బ్యూటీ.ఇక కొన్ని విషయాలను పంచుకుంది సదా.ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరగా ఉంది.అందులో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube