హీరోయిన్ కు మీరు ఎందుకు చీర కట్టించడం లేదు గురూజీ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తాజాగా వరుడు కావలెను సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సినిమా పై చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

 Heroine Saari Issue And Trivikram Comments  , Flim News, Heroine In Saree, Movie-TeluguStop.com

ఒక మంచి సినిమా ను చూశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆయన నమ్మకంగా చెప్పాడు.

ఆ విషయం పక్కన పెడితే ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయనకే ఎదురు కొట్టాయి.అవి ఏంటీ అంటే.

చాలా రోజుల తర్వాత సినిమా లో హీరోయిన్ చీర కట్టుకోవడం చూశాను.హీరోయిన్‌ పూర్తిగా చీరలోనే ఉండటం ఇక్కడ ప్రత్యేకత అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఆయన ఇలా హీరోయిన్ ను చీరలో చూస్తుంటే చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేశాడు.

Telugu Trivikram-Movie

ఆయన మాటలు నిజమే.ఈమద్య కాలంలో హీరోయిన్ అంటే చీరలో చూడటం చాలా అరుదు అయ్యింది.ఒకటి రెండు సన్నివేశాల్లో మాత్రమే చీరలు కట్టి కనిపిస్తున్నారు.

అందులో కూడా సాధ్యం అయినంతగా అందాల ప్రదర్శణ చేస్తున్నారు.భారీ ఎత్తున అందాల వింధు చేసే హీరోయిన్స్ ఉన్నారు కాని చీరలో పద్దతిగా కనిపించిన వారే లేరు.

కాని వరుడు కావలెను సినిమా లో మాత్రం రీతూ వర్మ చాలా పద్దతి అయిన చీరల్లో కనిపించింది.ఆకట్టుకునే చీర కట్టు ఆమె సొంతం అన్నట్లుగా అనిపించింది.

రీతూ వర్మ చీర కట్టును అభినందించిన మీరు ఎందుకు మీ సినిమా లో హీరోయిన్ ను చీర కట్టు లో చూపించడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.అల వైకుంఠ పురంలో సినిమా లో పూజా హెగ్డే ను సాధ్యం అయినంత అందంగా చూపించారు.

కాని ఒక్క సారి అయినా చీరలో పద్దతిగా చూపించలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube