రష్మీ, సుధీర్ లను పెళ్లి గురించి అడిగిన రోజా.. ఏం చెప్పారంటే..?

జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్.సోషల్ మీడియాలో సుధీర్ కు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.

 Heroine Roja Asks Questions About Marriage To Sudheer And Reshmi, Extra Jabardas-TeluguStop.com

ఇప్పటివరకు సుడిగాలి సుధీర్ చేసిన షోలు అన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి.సుధీర్ కోసమే షోను చూసే అభిమానులు కూడా అతనికి ఉన్నారు.

ఈటీవీ ఛానల్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తో అత్తమ్మ కూతురో అనే షో ప్రసారం కాగా ఆ షోకు సుధీర్ హాజరు కాకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన సుధీర్ వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు కాగా సుధీర్ కు ఇప్పటివరకు పెళ్లి కాలేదు.

సుధీర్ రష్మీ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నా జబర్దస్త్ కమెడియన్లు వాళ్లిద్దరూ మంచి స్నేహితులను అంతకు మించి వాళ్లిద్దరి మధ్య ఏం లేదని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో విడుదల కాగా ఆ ప్రోమోలో జడ్జి రోజా రష్మి, సుధీర్ ను పెళ్లి గురించి ప్రశ్నించారు.

Telugu Attoattamma, Extrajabardasth, Mano, Promo, Rashmi, Reshmi, Roja, Sudheer-

స్కిట్ లో భాగంగా సుధీర్ పెళ్లికొడుకు గెటప్ లో వచ్చి మనో, రోజాలకు పెళ్లి పత్రిక ఇస్తాడు.రోజా వెంటనే హమ్మయ్య.! ఇప్పటికైనా కుదిరింది అని చెబుతుంది.ఆ తరువాత మనో ఎన్నో పెళ్లి అని అడుగుతాడు.రోజా రష్మి, సుధీర్ లను పెళ్లి గురించి అడగగా సుధీర్ టైం ఉంది మేడమ్ అని చెబుతాడు.ఆ తరువాత ఏంటి రష్మి.

పెళ్లెప్పుడు చేసుకుందామని అనుకుంటున్నారు అని అడగగా రష్మీ సుధీర్ ను చూసి సిగ్గు పడింది.

ఆ తరువాత రోజా “మేమందరం వెయిటింగ్.ఎప్పుడు రావాలా పెళ్లికి.?” సుధీర్ ముదురు బెండకాయ అయిపోతున్నాడని చెబుతుంది.రోజా ముదురు బెండకాయ అని అనగానే రష్మీ ఫక్కున నవ్వేశారు.రష్మీని సుధీర్ నవ్వుతారేంటండి.? అని ప్రశ్నించగా నేను ముదురు బెండకాయ ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube