మగబిడ్డకు జన్మనిచ్చిన మిర్చి హీరోయిన్.. ఏం పేరు పెట్టారంటే..?

సాధారణంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో హీరోయిన్లు సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచన అస్సలు చేయరు.అయితే లీడర్, మిరపకాయ్, మిర్చి సినిమాలతో మంచి గుర్తింపుతో పాటు సక్సెస్ లు అందుకున్న రిచా గంగోపాధ్యాయ మాత్రం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే సినిమాలకు దూరమయ్యారు.

 Mirchi Heroine Richa Gangopadhyay Blessed Baby Boy In Last Month, Baby Boy, Last-TeluguStop.com

అయితే చదువు కోసం సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్ ఆ తరువాత తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగేల్లాను మ్యారేజ్ చేసుకున్నారు.

గత నెల 27వ తేదీన రిచా గంగోపాధ్యాయ మగబిడ్డకు జన్మనివ్వగా తాజాగా ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

రిచా గంగోపాధ్యాయ బాబుకు లుకా షాన్ అనే పేరును పెట్టినట్టు తెలిపారు.తన కొడుకు ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన రిచా గంగోపాధ్యాయ బాబు రాకతో తాము సంతోషంలో మునిగి తేలుతున్నామని పేర్కొన్నారు.

అచ్చం తండ్రి పోలికలతో లుకా జన్మించాడని ఆమె వెల్లడించారు.

తన కొడుకు అందంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉన్నాడని రిచా గంగోపాధ్యాయ పేర్కొన్నారు.

తమ లైఫ్ లో లుకా షాన్ చెప్పలేనంత ఆనందాన్ని నింపాడని ఆమె అన్నారు.పెళ్లి విషయాన్ని కూడా పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత వెల్లడించిన రిచా గంగోపాధ్యాయ కొన్ని రోజుల క్రితం బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు.

చివరగా రిచా గంగోపాధ్యాయ తెలుగులో భాయ్ సినిమాలో నటించారు.

ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మిర్చి సినిమా రిచా గంగోపాధ్యాయకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.పెద్దల అంగీకారంతో రిచా గంగోపాధ్యాయ స్నేహితుడిని పెళ్లి చేసుకున్నారు.రిచా కొడుకు లూన్ షాన్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube