అదో మాయ.. దాని వలలో పడకండి.. అమ్మాయిలను హెచ్చరించిన రియా చక్రవర్తి!

గత కొన్నేళ్లలో సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన ఇన్ స్టాగ్రామ్ యాప్ ను వినియోగించే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది.అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఇన్ స్టాగ్రామ్ ను ఎక్కువగా వాడుతున్నారు.

 Heroine Rhea Chakraborthy Shocking Comments About Instagram App Details, Rhea Ch-TeluguStop.com

కొంతమంది సోషల్ మీడియా యాప్స్ లోని ఫిల్టర్స్ సహాయంతో తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.అయితే బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రియా చక్రవర్తి ఫిల్టర్స్ ఫీచర్స్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

2020 సంవత్సరం జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన తర్వాత రియా చక్రవర్తి ఎక్కువగా వార్తల్లో నిలిచారు.కొంతకాలం జైలు జీవితం గడిపిన రియా చక్రవర్తి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఎక్కువగా సందేశాత్మక పోస్టులు పెడుతున్నారు.తాజాగా రియా చక్రవర్తి ఇన్ స్టాగ్రామ్ యాప్ ను వినియోగించే అమ్మాయిలకు కీలక సూచనలు చేశారు.

ఇన్ స్టాగ్రామ్ ఫిల్టర్లను వినియోగించి, ఇన్ స్టా బ్యూటీని వినియోగించి అందంగా కనిపించాలని అస్సలు ప్రయత్నించవద్దని రియా చక్రవర్తి అన్నారు.

Telugu App, Filters, Key, Sushanth Fried, Sushanthsingh-Movie

ఇన్ స్టాగ్రామ్ ఫిల్టర్స్ మాయ అని ఆమె కామెంట్లు చేశారు.నిజ జీవితంలో ఏ విధంగా ఉంటారో అదే అమ్మాయిల యొక్క అందం అని రియా చక్రవర్తి చెప్పుకొచ్చారు.అలా ఉండటం మాత్రమే తన దృష్టిలో రియల్ బ్యూటీ అని రియా చక్రవర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu App, Filters, Key, Sushanth Fried, Sushanthsingh-Movie

రియా చక్రవర్తి చెప్పింది నిజమేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కొంతమంది అమ్మాయిలు రియా చక్రవర్తిని ఇన్ స్టాగ్రామ్ బ్యూటీ, ఫిల్టర్స్ ఫీచర్స్ గురించి అడగడంతో ఆమె ఈ విధంగా స్పందించడం గమనార్హం.2021 సంవత్సరంలో రియా చక్రవర్తి నటించిన చెహ్రా సినిమా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube