మెగా హీరో సినిమాలో బాలీవుడ్ పాపకు బైబై..?

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాక్సర్’ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు.

 Heroine Replaced In Varun Tej Boxer Movie, Varun Tej, Boxer, Saiee Manjrekar, Na-TeluguStop.com

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలువుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తుండటంతో ఆయన ప్రొఫెషనల్ బాక్సింగ్ ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు.

కాగా కరోనా ప్రభావంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయింది చిత్రి యూనిట్.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ క్రమంలోనే వరుణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని సాయీ మంజ్రేకర్‌ను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమా నుండి ఆమెను తొలగించారట చిత్ర యూనిట్.

ఇక ఆమె స్థానంలో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్‌ను హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట.

ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

కాగా ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా అల్లు వెంకటేష్, సిద్ధు ప్రొడ్యూస్ చేస్తున్నారు.వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఈ సినిమాలో వరుణ్ సరసన నభా నటేష్ ఎలాంటి కెమిస్ట్రీ పండిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube