రష్మికని కదిలించిన రాయచూరు అత్యాచార ఘటన!  

రాయచూరులో గ్యాంగ్ రేప్ పై తన ఆవేదనని వ్యక్తం చేసిన రష్మిక.

Heroine Rashmika Sensational Comments On Raichur Gang Rape-

ఈ మధ్యకాలంలో తరుచుగా మహిళలపై అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో మీడియా ద్రుష్టి మొత్తం ఎన్నికలపైనే ఉంది. దీంతో కర్ణాటక రాష్ట్రంలో రాయచూరులో జరిగిన జరిగిన పెద్దగా వెలుగులోకి రాకుండా పోయింది..

రష్మికని కదిలించిన రాయచూరు అత్యాచార ఘటన! -Heroine Rashmika Sensational Comments On Raichur Gang Rape

రాయచూరు నవోదయ ఇంజినీరింగ్ విద్యార్థిని మధు పత్తార్‌పై కొందరు గ్యాంగ్ రేప్ కి పాడి దారుణంగా హత్యా చేసిన ఉదాంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇప్పుడు పోలీసులు ద్రుష్టి సారించి నిందితులని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని నిందితులు ఆమెతో బలవంతంగా సూసైడ్ నోట్ కూడా రాయించారని వెల్లడించారు.

ఈ దారుణ ఘటనపై టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక తన ఆవేదనని సోషల్ మీడియాలో తెలియజేసింది. మానవత్వం ఎక్కడ? రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధు అత్యాచారానికి గురైంది, ఆమెను దారణంగా హత్య చేశారు. నిజంగా ఈ సంఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది.

ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. దీనికి ఓ ముగింపు ఉండాలి’ అని రష్మిక ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సింగర్ చిన్మయి కూడా కూడా ఈ సంఘటనపై స్పందించింది. ఆమె తల్లిదండ్రులు ముందుగా ఫిర్యాదు చేసినపుడు పోలీసులు సీరియస్ గా తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని చెప్పింది.