Rashmika Favorite Food: ఆ సమయంలో నోరు కట్టేసుకోలేను.. ఫేవరెట్ ఫుడ్ ఏంటో బయటపెట్టిన రష్మిక!

కిరిక్ పార్టీ సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమైనటువంటి రష్మిక మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు చలో సినిమా ద్వారా పరిచయమయ్యారు.

 Heroine Rashmika Mandanna Reveals Her Favorite Food Details, ,rashmika,favorite-TeluguStop.com

ఇక తెలుగులో ఈమె నటించిన వరుస సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా తన ఫేవరెట్ ఫుడ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.స్వతహాగా తను మంచి భోజన ప్రియురాలని ఈమె తెలిపారు.

తను వివిధ రకాల ఆహార పదార్థాలను రుచి చూశానని అయితే ఇంటి భోజనంలో ఉన్న రుచి మరి ఇక్కడ దొరకదు అంటూ ఈమె వెల్లడించారు.తను భోజన ప్రియురాలు అయినప్పటికీ డైట్ విషయంలో ప్రతి ఒక్కటి తప్పనిసరిగా ఫాలో అవుతానని తెలిపారు.

Telugu Favorite, Pushpa, Rashmika-Movie

ఈ విధంగా డైట్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే తాను పొరపాటున తన కంటికి సుషీ, సూప్‌ నూడుల్స్‌ వంటి ఆహార పదార్థాలు కనుక కనపడితే నోరు కట్టేసుకోలేనని తప్పనిసరిగావాటిని తింటానని తెలిపారు.అదే విధంగా చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అన్న కూడా తనకు ఎంతో ఇష్టమనీ చెప్పుకొచ్చారు.ఇలా ఎప్పుడైనా తన డైట్ మిస్ అయితే కనుక వెంటనే తనని తాను తిరిగి ట్రాక్‌లోకి పెట్టుకునేందుకు రన్నింగ్‌పై దృష్టి పెడతానని ఈ సందర్భంగా రష్మిక తన ఆహారపు అలవాట్ల గురించి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube