పారితోషికంతో నిర్మాతను బెదరగొట్టిన 'పుష్ప' హీరోయిన్‌

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా పారితోషికం విషయంలో ప్రస్తుతం సౌత్‌ లోనే టాప్‌ ముద్దుగుమ్మల జాబితాలో నిలిచింది.సౌత్‌ హీరోయిన్స్ లో అయిదు కోట్ల పారితోషికం తీసుకునే ముద్దుగుమ్మలు చాలా చాలా అరుదు.

 Heroine Rashmika Mandanna Remuneration News-TeluguStop.com

అలాంటిది ఈ అమ్మడు ప్రస్తుతం ఏకంగా అయిదు కోట్ల రూపాయల పారితోషికంను తీసుకుంటూ ఉంది.పుష్ప సినిమా తో పాటు హిందీ సినిమా లు మరియు కన్నడ మరియు తమిళ సినిమా లు వరుసగా చేస్తున్న ఈ అమ్మడి డైరీ మొత్తం ఫుల్‌ బిజీ అయ్యింది.

అయినా కూడా ఈమె ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది.ఇటీవల ఒక తెలుగు నిర్మాత రష్మిక ను తమ బ్యానర్‌ లో నటించమని కోరేందుకు కలిసేందుకు ప్రయత్నించాడట.

 Heroine Rashmika Mandanna Remuneration News-పారితోషికంతో నిర్మాతను బెదరగొట్టిన పుష్ప’ హీరోయిన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకు మొదటే పారితోషికం చెప్పి ఆ నిర్మాతను హడలగొట్టింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పుష్ప సినిమా తో హీరోయిన్‌ గా పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకోవడం తో పాటు హిందీ సినిమా ల్లో కూడా నటిస్తూ అక్కడ భారీ పారితోషికం తీసుకుంటున్నాను… కనుక నాకు అయిదు కోట్ల పారితోషికం ఇవ్వాలని అంటూ డిమాండ్‌ చేసిందట.

మీడియం బడ్జెట్‌ సినిమా లు చేసే ఆ నిర్మాత హీరోయిన్ రష్మిక మందన్నా పారితోషికం విని మళ్లీ ఆమెతో కనీసం మాట్లాడేందుకు కూడా సాహసం చేయలేదట.

Telugu Film News, Five Crores Remuneration, Hindi Movie, Pan India Movie, Pushpa, Rashmika Mandana, Rashmika Remuneration, Telugu Producer, Tollywood-Movie

స్టార్‌ హీరోలకు జోడీగా నటించినా కూడా అంతగా పారితోషికం ఇస్తారా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె ఆ పారితోషికం కు ఆమె అర్హురాలే అంటున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ల్లో పాల్గొనేందుకు హాజరు అవ్వని రష్మిక మందన్నా వచ్చే నెల నుండి రెగ్యులర్‌ గా సినిమా షూటింగ్ లకు హాజరు అవ్వబోతుంది. అయిదు కోట్లు డిమాండ్‌ చేస్తే ఈమెకు సినిమాల్లో ఆఫర్లు దక్కేనా అనేది చూడాలి.

#Pan India Movie #Pushpa #FiveCrores

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు