తెగ ఫీలైపోతున్న రష్మిక మందన్న.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నకు 2021 సంవత్సరం కలిసిరావడం లేదు.ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.

 Heroine Rashmika Mandanna Disappoint With Sultan Movie Result-TeluguStop.com

ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్ సినిమాలు హిట్టైతే మాత్రం రష్మిక రెమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి.

అయితే ఈ ఏడాది రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు.

 Heroine Rashmika Mandanna Disappoint With Sultan Movie Result-తెగ ఫీలైపోతున్న రష్మిక మందన్న.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మిక కన్నడలో నటించిన సినిమాను తెలుగులో పొగరు పేరుతో డబ్ చేయగా ఆ సినిమా తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది.తొలిరోజు రష్మిక క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ బాగానే వచ్చినా తరువాత రోజుల్లో మాత్రం ఓపెనింగ్స్ రాకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

కార్తీ, రష్మిక జంటగా నటించిన సుల్తాన్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

సుల్తాన్ రష్మికకు హీరోయిన్ గా తమిళంలో తొలి సినిమా కాగా తొలి సినిమాతోనే రష్మిక ఫ్లాప్ ఫలితాన్ని అందుకోవడం గమనార్హం.వరుస ఫ్లాప్ సినిమాలు రష్మికకు ఉన్న క్రేజ్ ను తగ్గిస్తుండటం గమనార్హం.రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మిషన్ మజ్ను అనే సినిమాలో నటిస్తున్నారు.

హిందీలో రష్మికకు ఇదే తొలి సినిమా కాగా మిషన్ మజ్ను ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

వరుసగా నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో రష్మిక తెగ ఫీలవుతున్నారని సమాచారం.

మరోవైపు కోలీవుడ్ లో విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో మొదట రష్మిక పేరు వినిపించినా ఆమె స్థానంలో పూజా హెగ్డే ఎంపికయ్యారు.ఈ ఏడాది రష్మిక మందన్నా నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

#Mishan Majnu #DisappointWith #HeroinrRashmika #SultanMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు