మీ వల్లే ఇలా తయారయ్యా.. రష్మిక కామెంట్స్ వైరల్..?

కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న రష్మిక తెలుగుతో పాటు హిందీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.అయితే స్టార్ హీరోయిన్ అయిప్పటికీ రష్మిక ఆ గర్వం లేకుండా ఒదిగి ఉండటంతో పాటు అల్లరి పనులు చేస్తూ ఆ అల్లరికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

 Heroine Rashmika Mandanna Comments About Hotel Food, Comments ,heroine Rashmika,-TeluguStop.com

ప్రస్తుతం రష్మిక మందన్న కార్తీకి జోడీగా సుల్తాన్ మూవీలో నటిస్తుండగా ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా రష్మిక కెరీర్ లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన సుల్తాన్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో రష్మిక పల్లెటూరి యువతిగా వ్యవసాయం చేసే అమ్మాయి పాత్రలో కనిపిస్తుండగా రష్మిక వ్యవసాయం చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Telugu Rashmika, Hotel, Sultan-Movie

తాజాగా రష్మిక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో భాగంగా ఒక హోటల్ లో ఉన్నారు.ఆ సమయంలో సినిమా యూనిట్ రష్మికకు ప్రేమతో ఆహారం పెట్టగా ఆ ఆహారాన్ని చూసి మీ వల్లే తాను లావైపోతున్నానని కానీ ప్రేమతో ఆహారం పెట్టారు కాబట్టి తినేస్తానని ఆమె అన్నారు.రష్మిక బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించిన రష్మిక త్వరలో ఎన్టీఆర్ తో కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలలో నటిస్తున్న రష్మిక ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే రష్మిక ఈ సినిమాలో ఫైనల్ అయినట్లు అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube