హీరోయిన్ రాశీఖన్నా ఫేవరెట్ యాక్టర్ ఎవరో తెలుసా..?

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెరంగేట్రం చేసిన రాశీఖన్నా టాలీవుడ్ లో ఇతర ఇండస్ట్రీల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసి యూత్ ఫేవరెట్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు.ఎన్టీఆర్ కు జోడీగా జై లవకుశ సినిమాలో రాశీఖన్నా నటించగా ఆ సినిమా సక్సెస్ సాధించినా రాశీఖన్నాకు ఆఫర్లు అంతగా పెరగలేదు.

 Heroine Rashikhanna Favoruite Actor Details Here-TeluguStop.com

అయితే ఈ హీరోయిన్ ఫేవరెట్ యాక్టర్ కోలీవుడ్ హీరో కావడం గమనార్హం.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో సక్సెస్ సాధించిన రాజ్ అండ్ డీకే షాహిద్ కపూర్, రాశీఖన్నా జంటగా భారీ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

 Heroine Rashikhanna Favoruite Actor Details Here-హీరోయిన్ రాశీఖన్నా ఫేవరెట్ యాక్టర్ ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ భారీ వెబ్ సిరీస్ లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు.విజయ్ సేతుపతితో ఇప్పటికే కలిసి నటించిన రాశీఖన్నా మరోసారి అతనితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

తన ఫేవరెట్ హ్యూమన్ మరియు యాక్టర్ అయిన విజయ్ సేతుపతితో మూడోసారి కలిసి నటిస్తున్నానని రాశీఖన్నా తెలిపారు.బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సైతం తనను సెట్ మీదకు త్వరగా పిలవాలని కోరారు.

తొలిసారి షాహిద్ కపూర్ తో కలిసి నటిస్తున్న రాశీఖన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.విజయ్ సేతుపతి ఇప్పటికే తన టాలెంట్ తో అవకాశాలు అందిపుచ్చుకుంటుండగా ఈ వెబ్ సిరీస్ అతని కెరీర్ కు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

Telugu Details Here, Favorite Actor, Rashikhanna, Vijay Setupati-Movie

విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని షాహిద్ కపూర్ తెలిపారు.సెట్ లో రాశీఖన్నాకు తాను బాగా అలవాటు పడిపోయానని షాహిద్ కపూర్ అన్నారు.ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గిన రాశీఖన్నా వెబ్ సిరీస్ తో మళ్లీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

#Vijay Setupati #Details Here #Favorite Actor #Rashikhanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు