చరణ్ భార్య సీక్రెట్ బయటపెట్టిన రకుల్.. ఏమైందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 2021 సంవత్సరంలో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.రకుల్ నటించిన సినిమాలు భారీగా సక్సెస్ కాకపోయినా ప్రతిభ ఉన్న నటి కావడంతో రకుల్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

 Heroine Rakul Preet Singh Reveals Secret Of Upasana-TeluguStop.com

తాజాగా రకుల్ చరణ్ భార్య ఉపాసనకు సంబంధించిన ఒక సీక్రెట్ ను వెల్లడించారు.ఉపాసన యువర్ లైఫ్ పేరుతో ఒక వెబ్ సైట్ ను నడపటంతో పాటు ఫిట్ నెస్ గురించి, ఆరోగ్యకరమైన జీవనవిధానం గురించి ఈ వెబ్ సైట్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

ఉపాసన స్టార్ హీరోయిన్లతో ప్రోగ్రామ్ లు చేయించడంతో పాటు ఆయా హీరోయిన్ల ఆరోగ్య రహస్యాలను సైతం ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలిసేలా చేస్తున్నారు.తాజాగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ పాలకూర బఠాణి పలావ్ వంటకాన్ని తయారు చేయడంతో పాటు ఉపాసన యొక్క ఫిట్ నెస్ సీక్రెట్ ను కూడా వెల్లడించారు.

 Heroine Rakul Preet Singh Reveals Secret Of Upasana-చరణ్ భార్య సీక్రెట్ బయటపెట్టిన రకుల్.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉపాసన అన్నం తినడానికి అస్సలు ఆసక్తి చూపించదని ఎప్పుడూ డైట్ లో ఉంటుందని రకుల్ అన్నారు.

Telugu Best Health Tips, Fitness Secret, Rakul Preet Singh, Ram Charan Wife, Rashmika, Rice, Samantha, Upasana, Upasana And Rakul Fitness, Your Life Website-Movie

పాలకూర బఠాని పలావ్ చేసుకుంటే మాత్రం ఉపాసన రైస్ ను కూడా తినొచ్చని ఈ వంటకంలో పాలకూర, బఠాని ఎక్కువగా ఉండటంతో పాటు అన్నం చాలా తక్కువగా ఉంటుందని రకుల్ పేర్కొన్నారు.తాను ప్రతిరోజూ ఈ వంటకాన్నే తీసుకుంటానని ఈ వంటకాన్ని తీసుకుంటే వర్కౌట్లు కూడా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండదని ఉపాసన అన్నారు.కొన్ని వారాల క్రితం స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, సమంత ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.

ప్రస్తుతం రకుల్ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.రకుల్ ఈ సినిమాలో డీగ్లామరస్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం.

#Fitness Secret #Upasana #UpasanaAnd #Rice #Rashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు