అలాంటి సినిమాలు చేస్తే ఎక్కువ లాభం.. రకుల్ కీలక వ్యాఖ్యలు..?

కన్నడ, తెలుగు భాషల్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకు ముందు రకుల్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారానే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమా సక్సెస్ తరువాత రకుల్ కు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావడం ఆ సినిమాలు కూడా సక్సెస్ సాధించడం జరిగింది.

 Heroine Rakul Preet Singh Interesting Comments About Movies-TeluguStop.com

అయితే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లు కొన్నిసార్లు కథ నచ్చకపోయినా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.

స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి హీరోయిన్లు కొన్నిసార్లు కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు.

 Heroine Rakul Preet Singh Interesting Comments About Movies-అలాంటి సినిమాలు చేస్తే ఎక్కువ లాభం.. రకుల్ కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్టార్ హీరోయిన్ రకుల్ తెలుగులో జయాపజయాలకు అతీతంగా అవకాశాలను అందిపుచ్చుకుంటుండగా తాజాగా రకుల్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సినిమా పరిశ్రమలో సక్సెస్ సాధించాలంటే కొన్నిసార్లు నచ్చకపోయినా ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని రకుల్ పేర్కొన్నారు.

తన సినీ కెరీర్ లో కొన్నిసార్లు కథ నచ్చకపోయినా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోజులు ఉన్నాయని రకుల్ పేర్కొన్నారు.హీరో, డైరెక్టర్, బ్యానర్ ను బట్టి కూడా కొన్నిసార్లు సినిమాలను ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని రకుల్ వెల్లడించారు.

కొన్నిసార్లు అలాంటి సినిమాల ద్వారా ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ పొందే అవకాశం ఉంటుందని రకుల్ పేర్కొన్నారు.నటిగా ఎదగాలంటే మొహమాటం కొద్దీ కొన్ని సినిమాల్లో నటించక తప్పదని ఆమె అన్నారు.

ఆ మూవీ ఫ్లాప్ అవుతుందని తెలిసినప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వస్తుందని రకుల్ కామెంట్లు చేశారు.అలాంటి సినిమాల ద్వారానే హీరోయిన్లకు ఎక్కువ మొత్తం లాభం కలుగుతుందని ఆమె అన్నారు.

మరి రకుల్ ఇచ్చిన సూచనలను కొత్త హీరోయిన్లు కూడా పాటిస్తారేమో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు