ఆ రీజన్ వల్లే నేను తాగను.. రకుల్ కామెంట్స్ వైరల్..?

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆఫర్లు తగ్గడంతో యంగ్, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రకుల్ ఫోటోలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.

 Heroine Rakul Preet Singh Interesting Comments About Drinking Habbit , Comments-TeluguStop.com

ప్రస్తుతం రకుల్ కొండపొలం నవల ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన యూఆర్ లైఫ్ అనే వెబ్ సైట్ తో పాటు మ్యాగజైన్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ షో ద్వారా ఉపాసన స్టార్ హీరోయిన్లకు సంబంధించిన హెల్త్ సీక్రెట్లను వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.గతంలో కొంతమంది స్టార్ హీరోయిన్లు ఈ షోకు హాజరు కాగా తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ఈ షోకు హాజరయ్యారు.

ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రకుల్ తో ఉపాసన చిట్ చాట్ చేశారు.

ఉపాసన ఏ పనులు చేస్తే సంతోషంగా ఉంటారని రకుల్ ను అడగగా మంచి ఆహారాన్ని తీసుకోవడం, వర్కవుట్లు చేయడం, పని చేయడం వల్ల తాను సంతోషంగా ఉంటానని రకుల్ తెలిపారు.

ఆ తరువాత ఉపాసన రకుల్ అలవాట్ల గురించి మాట్లాడుతూ నువ్వు డ్రింక్ చెయ్యవని నాకు తెలుసని ఎందుకు డ్రింక్ చెయ్యవని ప్రశ్నించారు.ఆ ప్రశ్నకు రకుల్ తాను లైఫ్ లో సంతోషంగా ఉన్నాను కాబట్టే డ్రింక్ చెయ్యనని తెలిపారు.

Telugu Habbit-Movie

అయితే రకుల్ డ్రింక్ చెయ్యనని చెప్పడం పట్ల కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెటిజన్లు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.గతంలో వెలుగులోకి వచ్చిన ఒక కేసు విషయంలో రకుల్ పేరు వినిపించడంతో డ్రింక్ చేయనని చెప్పిన విషయంలో రకుల్ ను ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube