పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. నిశ్చితార్థం ఎప్పుడంటే..?

తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న రాయ్ లక్ష్మీ పెళ్లికి సంబంధించి గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.గతేడాది లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు.

 Heroine Raai Laxmi Announces Her Engagement Unexpected Twist-TeluguStop.com

రాయ్ లక్ష్మీ కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారు.పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో తాజాగా రాయ్ లక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు సంబంధించి కొంతమంది నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని తాను అనుకుంటున్నానని ఆమె తెలిపారు.తాను రిలేషన్ షిప్ గురించి దాచాలని అనుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.

 Heroine Raai Laxmi Announces Her Engagement Unexpected Twist-పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. నిశ్చితార్థం ఎప్పుడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇతరులకు తన రిలేషన్ షిప్ కు సంబంధించిన విషయాలను చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.తను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటానో ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలని అనుకోవడం లేదని రాయ్ లక్ష్మీ పేర్కొన్నారు.

Telugu Engagement, Khaidi Number 150, Raai Laxmi, Raai Laxmi Marriage Comments, Raai Laxmi Marriage Dates, Raai Laxmi Marriage Fixed, Raai Laxmi Marriage Update, Raai Laxmi Wedding, Unexpected Twist-Movie

ఈ నెల 27వ తేదీన తన నిశ్చితార్థం జరగబోతుందని.కొన్ని రోజుల క్రితమే బంధుమిత్రులకు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ ను పంపామని ఆమె తెప్పారు.నిశ్చితార్థ వేడుక అకస్మాత్తుగా జరుగుతోందని.ఎప్పుడో ప్లాన్ చేసుకుని తాను నిశ్చితార్థ వేడుకను జరుపుకోవడం లేదని రాయ్ లక్ష్మీ వెల్లడించారు.తన ఎంగేజ్ మెంట్, పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

తన లవ్ తో లైఫ్ ను పంచుకోవడం కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె వెల్లడించారు.

ఈ నెల నిశ్చితార్థ వేడుక జరుగుతుండటంతో మే నెలలో పెళ్లి వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.అయితే రాయ్ లక్ష్మి ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో ఖైదీ నంబర్ 150 సినిమాలోని రత్తాలు పాటతో రాయ్ లక్ష్మీ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

#RaaiLaxmi #Engagement #RaaiLaxmi #Raai Laxmi #RaaiLaxmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు