తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ మీకు గుర్తుందా....?

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన  “లీడర్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన  మలయాళం బ్యూటీ “ప్రియా ఆనంద్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి హిట్ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొత్త సినీ అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం విఫలం అయింది.

 Telugu Heroine Priya Anand Movie Offers News, Actress Priya Anand, Movie Offers,-TeluguStop.com

దీనికితోడు ఈ అమ్మడు తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగలేదు పోయింది.

అయితే తెలుగులో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించిన “కో అంటే కోటి, రామ రామ కృష్ణ కృష్ణ,” తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

కానీ ఈ అమ్మడికి కొత్త సినిమా అవకాశాలను మాత్రం తెచ్చి పెట్టలేక పోయాయి. దీంతో ప్రియా ఆనంద్ తెలుగులో సినిమా అవకాశాలు లేకపోవడంతో తమిళం, మలయాళం సినిమా పరిశ్రమల్లో అడపాదడపా సినిమాలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. 

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రియా ఆనంద్ కన్నడ భాషలో “ఆర్డిఎక్స్” అనేఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.

అలాగే తమిళ భాషలో “సుమో” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాధాన్యత పాత్రలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube