వైరల్ ఫోటోస్: తెగ ఎంజాయ్ చేస్తున్న బాపు గారి బొమ్మ..  

Actress Pranitha Subash in Maldives Photos viral, Actress Pranitha Subash , Maldives, Beach wear, Maldives Resorts, Tollywood Heroine - Telugu @pranitasubhash, Actress Pranitha Subash, Actress Pranitha Subash In Maldives Photos Viral, Beach Wear, Covid-19, Maldives, Maldives Resorts, Pawan Kalyan, Praneetha, Tollywood Heroine

టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు ప్రణీత.అత్తారింటికి దారేది చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించింది.

TeluguStop.com - Heroine Pranitha Subhash Maldives Vacation Photos Viral

ఈ చిత్రంలో బొంగ‌రాలంటీ కళ్ళు తిప్పింది, ఉంగ‌రాలున్నా జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమ వంపులో నన్నే తిప్పింది, అమ్మో బాపు గారి బొమ్మో.అంటూ సాగే ఈ పాట ఎంత క్రేజ్ సంపాదించిందో ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు.

బాపు గారి బొమ్మ లా ఉండే ప్ర‌ణీత‌కు ఈ పాట స‌రిగ్గా సెట్ అయిందంటూ సినిమా చూసి‌న వారంతా అన్నారు.తన అందంతో ఇంకా అభినయంతో అంద‌రినీ ఆక‌ట్టుకుని అతి కొద్దీ కాలంలోనే మంచి పేరు సంపాదించింది ప్రణీత.

TeluguStop.com - వైరల్ ఫోటోస్: తెగ ఎంజాయ్ చేస్తున్న బాపు గారి బొమ్మ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఈ అందాల బాపు బొమ్మ తనకి ఫేవ‌రెట్ టూరిజం స్పాట్ అయిన మాల్దీవుల్లో చ‌క్క‌ర్లు కొడుతూ కనిపించింది.

మాల్దీవుల్లోని సముద్రం దగ్గర ఉన్న రిసార్ట్స్ లో సైకిల్‌ తొక్కుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ అమ్మడు.వైట్ అండ్ బ్లూ బీచ్ వేర్ లో గాగుల్స్ వేసుకొని, చాలా స్టైలిష్ గా, అందంగా కనిపించింది ప్రణీత.తన ఫ్రెండ్ మ‌ధుతో స‌ముద్ర‌తీరంలో సేద తీరుతూ కనిపించింది.

ప్రస్తుతం ప్రణీత ఇంకా తన స్నేహితురాలు కలిసి మాల్దీవులు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రణీత పూర్తి పేరు ప్రణీత సుభాష్.

ఈ బాపు బొమ్మ 2010లో దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి చిత్రం కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడలో చేసి మంచిపేరు సంపాదించింది.టాలీవుడ్ లో ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెరంగేట్రం చేసి, తర్వాత బావ చిత్రంలో హీరో సిద్దార్థ్ కి జతగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.తరువాత కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మెప్పించి హీరోయిన్ గా ఎదిగింది.తెలుగులో అత్తారింటికి దారేది చిత్రంతో పెద్ద తారగా స్థిరపడింది.

#Beach Wear #ActressPranitha #@pranitasubhash #Maldives #Praneetha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Pranitha Subhash Maldives Vacation Photos Viral Related Telugu News,Photos/Pics,Images..