ప్రణీత నటించిన రెండు హిందీ సినిమాలు ఒటీటీ బాటలోనే

భావ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కన్నడ భామ ప్రణీత.ఈ బ్యూటీ ఆరంభంలో మంచి అవకాశాలని సొంతం చేసుకుంటూ ఏకంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో రొమాన్స్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

 Heroine Pranitha Disappointed Twice In Bollywood, Tollywood, Hangama 2 Movie, Aj-TeluguStop.com

అయితే తరువాత అనుకున్న స్థాయిలో టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం లేదు.మాతృభాషలో మాత్రం ఈ బ్యూటీ భాగానే సినిమాలు చేస్తుంది.

అలాగే తమిళ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.ఇక ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి.

భూజ్‌ ద ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా, హంగామా 2 చిత్రాల్లో ప్రణీత కీలక పాత్రలలో నటించింది.అజయ్ దేవగన్, సంజయ్ దత్ నటించిన భూజ్ మూవీ షూటింగ్ గతేడాది పూర్తయ్యింది.

ఆగష్టు 14, 2020 ఇండిపెండెంట్ సందర్భంగా సందర్భంగా థియేటర్‌లో విడుదల చేయాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడింది.

తరువాత ఈ మూవీ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.ఇదిలా ఉండగా తను నటించిన రెండవ చిత్రం హంగామా 2 సైతం ఓటీటీ బాట పట్టేలా కనిపిస్తోంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రెడీ అయ్యింది.అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది.

ఇప్పుడు ఒటీటీ ఛానల్ నుంచి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది.త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి ప్రణీత నటించిన రెండు హిందీ సినిమాలు కూడా ఒటీటీలో రిలీజ్ కావడంతో ఆ అమ్మడుకి అక్కడ కూడా కెరియర్ పరంగా నిరాశ తప్పేలా లేదని టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube