అప్పుడు ఆమెకు బాలకృష్ణ దేవుడిలా కనిపించాడట

Heroine Poorna Interesting Comments On Balakrishna

నందమూరి బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన అఖండ సినిమా వచ్చే నెల రెండవ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

 Heroine Poorna Interesting Comments On Balakrishna-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్‌ గెస్ట్‌ గా హాజరు అయ్యాడు.

ఇక హీరోయిన్ అయిన ప్రజ్ఞా జైస్వాల్ మరియు పూర్ణలు మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తూ అఖండ సినిమా యొక్క గొప్పతనం బాలకృష్ణ ఎలా చేశాడు అనే విషయాన్ని బోయపాటి ఎలా తీశాడు అనే విషయాలను చెబుతున్నారు.వీరిద్దరు మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా సినిమా అద్భుతం అంటూ గట్టిగా చెబుతున్నారు.

 Heroine Poorna Interesting Comments On Balakrishna-అప్పుడు ఆమెకు బాలకృష్ణ దేవుడిలా కనిపించాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Akhanda, Balakrishna, Poorna, Pragya Jaiswal-Movie

తాజాగా పూర్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఆయనను గెటప్ లో చూసిన సమయంలో నిజంగా దేవుడు అనుకున్నాను.ఆ సమయంలో ఆయన ని చూస్తుంటే దేవుని చూసినట్లు అనిపించింది.బాలకృష్ణ నటుడిగా ఒక దేవుడు అంటూ పూర్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.బాలకృష్ణ సరసన నటించడంతో తనకు చాలా అనుభవంను నేర్పింది అంటూ పూర్ణ చెప్పుకొచ్చింది.అద్భుతమైన సినిమాను చేసినందుకుగాను తనకు తాను చాలా సంతోషంగా ఉన్నానని పూర్ణ పేర్కొంది.

ప్రజ్ఞ జైస్వాల్‌ కూడా తనకు అఖండ లో మంచి పాత్ర దక్కిందని బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.కథ మొత్తం కూడా తన చుట్టూ తిరుగుతుందని ప్రజ్ఞ చెప్పుకొచ్చింది.

ఈ సినిమా తర్వాత కచ్చితంగా టాలీవుడ్ లో బిజీ అవుతానని అంటూ ఆమె నమ్మకం గా ఉంది.బాలయ్యకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అంటూ నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

#Poorna #Pragya Jaiswal #Balakrishna #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube